కాంగ్రెస్ పాలనలో కేసులే తప్ప ఫలితం శూన్యం

Spread the love

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్ | బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేసులు వేయడమే పాలనగా కొనసాగుతోందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు తీవ్రంగా విమర్శించారు. జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మికుంట పట్టణంలోని 9, 10, 11, 16, 17, 18, 19, 20,29, 4, 5 వార్డులతో పాటు హుజురాబాద్ పట్టణంలోని 8, 9 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు దిశా నిర్దేశం చేశారు.

హుజురాబాద్–జమ్మికుంట ప్రాంత ప్రజలు ప్రత్యక్షంగా చూసినట్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి సరఫరా, రహదారులు, మున్సిపల్ అభివృద్ధి, మౌలిక వసతులు , పేదల సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలయ్యాయని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, కంటి వెలుగు, కేసీఆర్ కిట్, వృద్ధులు–వితంతువులు–వికలాంగులకు పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు పేద కుటుంబాలకు నిజమైన భరోసాగా నిలిచాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు కాకుండా మిగిలి పోయాయని, ముఖ్యంగా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయని, ప్రజల అభివృద్ధి కన్నా రాజకీయ లబ్ధికే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించారు.

  • Related Posts

    విద్యార్థి ప‌వ‌న్ కుమార్ సూసైడ్ కేసులో 12 మంది అరెస్ట్

    Spread the love

    Spread the loveకీల‌క వివ‌రాలు వెల్ల‌డించిన డీఎస్పీ చల‌సాని, సీఐ పెన‌మ‌లూరు : రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన పోరంకి లోని శ్రీ చైత‌న్య కాలేజీలో చ‌దువుతున్న మొల్లి ప‌వ‌న్ కుమార్ సూసైడ్ కేసులో కీల‌క మ‌లుపు తిరిగింది. స‌హ‌చ‌ర విద్యార్థులు త‌న‌పై…

    మ‌దిర‌తో ఎన్నో జ‌న్మ‌ల బంధం : భ‌ట్టి విక్ర‌మార్క‌

    Spread the love

    Spread the loveన‌న్ను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించింది ఖ‌మ్మం జిల్లా : డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్ ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం చేప‌ట్టారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *