మ‌దిర‌తో ఎన్నో జ‌న్మ‌ల బంధం : భ‌ట్టి విక్ర‌మార్క‌

న‌న్ను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించింది

ఖ‌మ్మం జిల్లా : డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్ ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న భావోద్వేగానికి లోన‌య్యారు. మ‌ధిర అంటే త‌న‌కు పంచ ప్రాణం అన్నారు. త‌న‌ను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించార‌ని, ఆపై ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా సేవ చేసే అవకాశం కల్పించింద‌న్నారు. బ‌తికి ఉన్నంత వ‌రకు రుణ‌ప‌డి ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. మ‌ధిర‌తో విడ‌దీయ‌లేని బంధం నెల‌కొంద‌న్నారు. మధిర కీర్తి ప్రతిష్టలను పెంచుతాన‌ని, మరో 50 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అద్భుతమైన పట్టణాన్ని నిర్మించే బాధ్యతను నేను తీసుకుంటున్నానని ప్ర‌క‌టించారు.

హైదరాబాద్, అమెరికా తరహాలో మధిరలో అత్యున్నత వైద్య రక్షణ సదుపాయాలు కల్పిస్తాం అని తెలిపారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.రెప్పపాటు కూడా కరెంటు పోకుండా అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థను,
స్వచ్ఛమైన నగరం కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను వేగవంతం చేస్తున్నాం అన్నారు. పట్టణ విస్తరణకు కీలకమైన ఔటర్ రింగ్ రోడ్డు పనుల కోసం ఇప్పటికే నిధులు జమ చేశామ‌ని వెల్ల‌డించారు డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. వర్షపు నీరు, మురుగు నీటి తరలింపునకు ప్రత్యేక మార్గాలు నిర్మిస్తూనే , వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం కోసం రిటైనింగ్ వాల్ మరియు బ్రిడ్జిల నిర్మాణం చేపడుతున్నాం అన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *