మీ సహకారం వల్లే స్టీల్ ప్లాంట్ లాభాల బాట
న్యూఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రులు అమిత్ షా, అశ్విని వైష్ణవ్, శివరాజ్ సింగ్ పాటిల్ , నిర్మలా సీతారామన్, మనోహర్ లాల్ ఖట్టర్, సీఆర్ పాటల్ లను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఏపీకి రావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలని కేంద్ర మంత్రులను కలిసి విన్నవించారు. ఈ మేరకు వినతిపత్రాలను సమర్పించారు. ఆయన వెంట కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ , కింజారపు రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఉన్నారు. వీరి వెంట ఎంపీలు కూడా హాజరయ్యారు.
ఇదిలా ఉండగా పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు తన స్నేహితుడైన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి , మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. కేంద్రం అందించిన ఆర్ధిక సాయం, రాష్ట్ర ప్రభుత్వ మద్దతు, స్టీల్ ప్లాంట్ కార్మికులు-ఉద్యోగుల పట్టుదల, శ్రమ కారణంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టిందని అన్నారు. ఈ సందర్బంగా ఆర్థిక సాయం చేసినందుకు ప్రత్యేకంగా కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు నారా చంద్రబాబు నాయుడు.





