ఏఐ టెక్నాల‌జీతో విద్యా రంగంలో కీల‌క మార్పులు

VijayaBhaskar · February 16, 2026
Spread the love

స్ప‌ష్టం చేసిన బిల్ గేట్స్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ బిల్ గేట్స్

అమ‌రావ‌తి : ఏపీలో ప‌ర్య‌టించిన టెక్నాల‌జీ దిగ్గ‌జం, బిల్ గేట్స్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ బిల్ గేట్స్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. విద్యారంగంలో అద్భుతమైన మార్పులు తీసుకు రావడానికి ఏఐ-టెక్నాలజీ ఉపయోగ పడుతుందని అన్నారు. వ్యవసాయం రంగం చాలా ముఖ్యమైన రంగమని అభిప్రాయపడ్డారు బిల్ గేట్స్… ఈ రంగం ఎంత ముఖ్యమో ఇప్పటికీ చాలా మందికి తెలియదని వ్యాఖ్యానించారు. టెక్నాలజీ సాయంతో ఏపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. టెక్నాలజీని రైతులకు అందించేందుకు ఏఐను వ్యవసాయంతో ఇంటిగ్రేట్ చేసేందుకు ఏపీ కృషి చేస్తోందని ప్ర‌శంసించారు బిల్ గేట్స్.

అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వ్యవసాయంలో AI టెక్నాలజీని వినియోగంచడం లేదని… కానీ ఆంధ్రప్రదేశ్ దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తుండం మంచి పరిణామమని అఅన్నారు గేట్స్
డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం టెక్నాలజీతో ముందస్తు అంచనాలతో ప్రాణ నష్టం జరగ్గకుండా జాగ్రత్తలు తీసుకునే వ్యవస్థ ఏర్పాటు కావడం బాగుందన్నారు. డిజిటల్ గవర్నెన్స్ అనే ఆలోచనను ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పడానికి తాను ప్రయత్నిస్తున్న సమయంలో సీఎం చంద్రబాబు దాని గురించి ఆలోచన చేయడమే కాకుండా ఏకంగా రాష్ట్రంలో అమ‌లు చేయ‌డం అద్భుతం అని ప్ర‌శంసించారు బిల్ గేట్స్.