చిన్నశేష వాహనంపై శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం

Spread the love

జూబ్లీహిల్స్ లో శ్రీ‌వారి భ‌క్తుల సందోహం వైభ‌వోపేతం

తిరుపతి : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆల‌యంలో వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల కోలాటాలు, మంగ‌ళ వాయిద్యాలు, ఇతర కళా ప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా సాగింది.

చిన్నశేషుడిని వాసుకి( నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేష వాహనం ఈ శేషి భావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయ‌స్సుతో పాటు కుండలినీ యోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. వాహ‌న‌సేవ‌లో అర్చకులు, ఏఈవో రమేష్, టెంపుల్ ఇన్పెక్టర్స్ నిరంజన్, హరికృష్ణ, పలువురు అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండ‌గా ఒంటిమిట్ట‌లోని శ్రీ కోదండ రామ‌స్వామి క‌ళ్యాణోత్స‌వానికి సిద్ద‌మైంది. టీటీడీ ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇవాళ జేఈవో వీర‌బ్ర‌హ్మం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు.

  • Related Posts

    ఒంటిమిట్ట బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లు వేగ‌వంతం చేయాలి

    Spread the love

    Spread the loveఏప్రిల్ 1న శ్రీ సీతారాముల క‌ల్యాణం : టిటిడి జేఈవో వీర‌బ్ర‌హ్మం తిరుప‌తి జిల్లా : ఒంటిమిట్టలో వార్షిక బ్ర‌హ్మోత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్బంగా ఏర్పాట్ల‌ను గురువారం ప‌రిశీలించారు టీటీడీ జేఈవో వి. వీర‌బ్రహ్మం. కీల‌క సూచ‌న‌లు చేశారు.…

    హంస వాహనంపై ఊరేగిన శ్రీ వేంకటేశ్వర స్వామి

    Spread the love

    Spread the loveతొండ‌మాన్ పురం ఆలయంలో బ్ర‌హ్మోత్స‌వాలు తిరుపతి : తొండమాన్‌పురం లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా సాగుతున్నాయి. ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ నెల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *