Friday, 16 October 2026

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఢిల్లీ బాట

newsseals-APCM

జైపూర్ లో పెళ్లికి హాజ‌రు కానున్న నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. రాజ‌ధాని వేదిక‌గా ప్ర‌పంచ ఏఐ స‌మ్మిట్ కు హాజ‌రు కానున్నారు. మద్యాహ్నం 1.30 గంటలకు ఏఐ సమ్మిట్ వేదిక వద్దే యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన ప్రతినిధి బృందంతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. బ్రిటన్ ఏఐ, ఆన్ లైన్ సేఫ్టీ విభాగం మంత్రి కనిష్క నారాయణ్, భారత్ లో యూకే హై కమిషనర్ లిండి కెమరాన్, వాతావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ కౌన్సెలర్ శాలీ టేలర్ తదితరులతో ముఖ్యమంత్రి సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు. మద్యాహ్నం 3 గంటలకు అరామ్కో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ రెహమాన్ అయితుకైర్, అడోబ్ సీఈఓ శాంతనూ నారాయణ్, ఆటోడెస్క్ ఏఐ హెడ్ మైక్ హాలే తో ముఖ్యమంత్రి వేర్వేరుగా సమావేశం కానున్నారు.

అనంతరం ఢిల్లీ నుంచి బయల్దేరి రానున్నారు. కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్, ఐఎఎస్ అధికారి వికాస్ మర్మత్ వివాహానికి హాజరయ్యేందుకు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు జైపూర్ కు బయల్దేరి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడ నుంచి జైపూర్ కు బయలు దేరనున్నారు. జైపూర్ లోని వృందావన్ ప్యాలెస్ లో జరిగే వివాహానికి హాజరై రాత్రికి అక్కడే బస చేయనున్నారు. రేపు ఉదయం జైపూర్ నుంచి బయల్దేరి ఢిల్లీలో జరిగే ఇండియా ఇంపాక్ట్ ఏఐ సదస్సుకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *