ప్ర‌జ‌ల కోణంలో పార్టీని న‌డుపుతాం : క‌విత

Spread the love

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన మాజీ ఎమ్మెల్సీ

హైద‌రాబాద్ : మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్ట‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. గురువారం హైద‌రాబాద్ లోని తెలంగాణ జాగృతి సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో కవిత మీడియాతో మాట్లాడారు. వ‌చ్చే మే నెల‌లో పార్టీని ప్ర‌క‌టిస్తామ‌ని, మంచి ముహూర్తం కోసం ఇంత కాలం ఆగాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్ర‌ముఖులు త‌న‌తో ట‌చ్ లో ఉన్నారంటూ బాంబు పేల్చారు. సంద‌ర్బం వ‌చ్చిన‌ప్పుడు ఈ విష‌యం తెలియ చేస్తాన‌న్నారు. ఇదే స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల గురించి కూడా ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌.

ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. త‌ను ఎక్క‌డా ఫెయిల్యూర్ కాలేద‌న్నారు. ఆమె జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్య‌క్షురాలు అని ఆ విష‌యం మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. పార్టీ లు పెట్టి ఫెయిల్ అయిన మగవారి గురించి ఎందుకు చర్చ చేయరంటూ ప్ర‌శ్నించారు. కేవ‌లం ఆడ‌వాళ్ల ను ల‌క్ష్యంగా చేసుకుని నిల‌దీయ‌డం ప‌రిపాటిగా పారిందంటూ మండిప‌డ్డారు. తెలంగాణ మా పార్టీ మదర్ బోర్డ్ అని, సామాజిక తెలంగాణ మా పార్టీ ల‌క్ష్య‌మ‌న్నారు. ప్ర‌జ‌ల కోణంలో పార్టీని న‌డిపిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

  • Related Posts

    ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఢిల్లీ బాట

    Spread the love

    Spread the loveజైపూర్ లో పెళ్లికి హాజ‌రు కానున్న నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. రాజ‌ధాని వేదిక‌గా ప్ర‌పంచ ఏఐ స‌మ్మిట్ కు హాజ‌రు కానున్నారు. మద్యాహ్నం 1.30 గంటలకు ఏఐ సమ్మిట్…

    హెరిటేజ్ పై వైసీపీ బుర‌ద చ‌ల్లితే ఎలా..?

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌భుత్వాలను అడ్డం పెట్టుకుని చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌డం త‌గ‌ద‌న్నారు. హెరిటేజ్ సంస్థ ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని వ్యాపార…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *