రాజమౌళితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది

Spread the love

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన వార‌ణాసి న‌టి ప్రియాంక చోప్రా

అమెరికా : ప్ర‌ముఖ హీరోయిన్ వార‌ణాసి మూవీలో కీల‌క రోల్ పోషించిన ప్రియాంక చోప్రా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమార‌న్, ప్రిన్స్ మ‌హేష్ బాబు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సంద‌ర్బంగా అంత‌ర్జాతీయ ప‌రంగా పేరు పొందిన ఛాన‌ల్ కు ఈ ముగ్గురూ చిట్ చాట్ చేశారు. ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది ప్రియాంక చోప్రా. త‌న‌తో క‌లిసి ప‌ని చేయ‌డం ఆనందంగా ఉంద‌ని అన్నారు. త‌ను జీవితంలో కూడా జ‌క్క‌న్న సినిమాలో న‌టిస్తాన‌ని అనుకోలేద‌ని పేర్కొన్నారు. భారతదేశంలోని అత్యుత్తమ దర్శకులలో ఒకరైన రాజమౌళి దర్శకత్వంలో నటించడం మామూలు విష‌యం కాద‌న్నారు.

ప్ర‌త్యేకించి ఇది నా కెరీర్‌లో అర్థవంతమైన చిత్రం అవుతుందని అన్నారు. అభిమానులతో పాటు నేను కూడా దీని విడుదల కోసం ఎంత‌గానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని ప్రియాంక అన్నారు. వారణాసిలో ఆమె మందాకినిగా కనిపిస్తుంది, కథనంలో కీలకమైన పాత్ర. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. గ్లోబల్ సెన్సేషన్ RRR తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన తొలి చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి. MM కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు, కథను విజయేంద్ర ప్రసాద్ రాశారు.

  • Related Posts

    సీతా ప‌య‌నం ట్రైలర్ విడుదల

    Spread the love

    Spread the loveఅర్జున్ సర్జా యాక్షన్ , లవ్ ట్రీట్ యాక్షన్ కింగ్ అర్జున్ తన బ్యానర్ శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ కింద నిర్మించిన సీత పయనం తో తిరిగి వచ్చాడు. ఈ చిత్రంలో త‌న కూతురు ఐశ్వర్య అర్జున్…

    ఉద‌య్ పూర్ లో ఒక్క‌టి కానున్న దేవ‌ర‌కొండ‌, మంద‌న్నా

    Spread the love

    Spread the loveమార్చి 4న హైద‌రాబాద్ లో వివాహ రిసెప్ష‌న్ హైద‌రాబాద్ : పుకార్ల‌కు పుల్ స్టాప్ పెట్టేశారు. గాసిప్స్ కు ఛాన్స్ లేకుండా చేశారు. తామిద్ద‌రం పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఉత్కంఠ‌కు తెర దించారు. ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *