పాల‌న సౌల‌భ్యం కోసం ఏఐ వినియోగం

సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

న్యూఢిల్లీ : పాల‌నా సౌల‌భ్యం కోసం ఏఐ వినియోగం అత్యంత కీల‌కంగా మారుతుంద‌ని అన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్, భారత్‌జెన్, నెక్స్‌జెన్ , ఐబిఎం ఇండియాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా AI టెక్ హబ్‌ను ప్రారంభించింది. ఈ చొరవ రైతుల నుండి మత్స్యకారుల వరకు పౌరులకు సాధికారత కల్పిస్తుంది. భవిష్యత్తులో క్వాంటం-AI ఇంటిగ్రేషన్‌తో కలుపుకొని, తెలుగుకు ప్రాధాన్యతనిచ్చే, పౌరులకు ప్రాధాన్యతనిచ్చే AIతో జాతీయ ఉదాహరణను సృష్టిస్తుంది. ప్రొఫెసర్ గణేష్ రామకృష్ణన్ (భారత్‌జెన్), హృషికేశ్ మోహల్ బాల్ (భారత్‌జెన్), ఎ ఎస్ రాజ్‌గోపాల్ (ఎన్‌ఎక్స్‌టెన్), అభిష్యంత్ అనసపురపు (ఎన్‌ఎక్స్‌టెన్), డాక్టర్ అమిత్ సింఘీ (ఐబిఎం రీసెర్చ్ ఇండియా), సందీప్ పటేల్ (ఐబిఎం ఇండియా) చేరడం ఆనందంగా ఉందని అన్నారు సీఎం చంద్ర‌బాబు నాయుడు.

క్వాంటం, ఏఐ, సైబర్ సెక్యూరిటీలో రాష్ట్రంలోని 1 లక్ష మంది యువతకు శిక్షణ ఇచ్చేలా ఐబీఎంతో ఎంఓయూ చేసుకున్న‌ట్లు తెలిపారు. ఐబీఎం గ్లోబల్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ ఫాం ద్వారా ఐటీ పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. భారత్ లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్ వర్క్ ఫోర్సును సిద్ధం చేసుకునే లక్ష్యాల్లో భాగంగా ఐబీఎం శిక్షణా కార్యక్రమం ఉంటుంన‌ద్నారు. ఒప్పందం కార్యక్రమానికి హాజరైన ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్, ఆ సంస్థ దక్షిణాసియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాలాజీ, ఐబీఎం రీసెర్చ్ లాబ్స్ డైరెక్టర్ అమిత్ సింఘీ తదితరులు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *