వెల్ డ‌న్ సంజూ శాంస‌న్ : గౌతం గంభీర్

Spread the love

టీమిండియాను సెమీస్ కు చేర్చిన శాంస‌న్

కోల్ క‌తా : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త జ‌ట్టు సెమీ ఫైన‌ల్ కు చేరుకుంది. కోల్ క‌తా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో వెస్టిండీస్ జ‌ట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ విరోచిత‌మైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. ఒక్క‌డే ఒంట‌రి పోరాటం చేశాడు. వ‌ర‌ల్డ్ క‌ప్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించిన జ‌ట్టుగా రికార్డు న‌మోదు చేసింది భార‌త జ‌ట్టు. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ముందుగా బ్యాటింగ్ చేసింది విండీస్. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 195 ర‌న్స్ చేసింది. అనంత‌రం భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగింది.

వ‌చ్చీ రావ‌డంతోనే ఎటాక్ మొద‌లు పెట్టినా చివ‌ర‌కు అభిషేక్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్ లు వెంట వెంట‌నే పెవిలియ‌న్ బాట పట్టారు. దీంతో ఇండియా గెలుస్తుందా లేదా అన్న అనుమానం నెల‌కొంది. స్టేడియం మొత్తం సైలంట్ అయ్యింది. ఈ స‌మ‌యంలో ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌లేదు సంజూ శాంస‌న్. త‌ను క‌ళ్లు చెదిరే షాట్స్ తో విరుచుకు ప‌డ్డాడు. విండీస్ బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టాడు. ఒక ర‌కంగా విండీస్ ఆట‌గాళ్ల‌కు కునుకు లేకుండా చేశాడు. త‌ను ఒక్క‌డే 50 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 4 సిక్స్ ల‌తో 97 ర‌న్స్ చేశాడు. చివ‌రి దాకా నాటౌట్ గా ఉన్నాడు. ఇండియాను విజ‌య తీరాల‌కు చేర్చాడు. ఆపై సెమీ ఫైన‌ల్ కు చేరుకుంది భార‌త జ‌ట్టు. ఈ సంద‌ర్బంగా హెడ్ కోచ్ గౌతం గంభీర్ స్పందించాడు. వెల్ డ‌న్ సంజూ శాంస‌న్ అంటూ అభినంద‌న‌ల‌తో ముంచెత్తాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైర‌ల్ గా మారాయి.

  • Related Posts

    భార‌త జ‌ట్టు టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలి

    Spread the love

    Spread the loveసంజూ శాంస‌న్ ఆట తీరు అద్భుతం ఒడిశా : ఒడిశా మాజీ ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ భార‌త జ‌ట్టును ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. కోల్ క‌తా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన పోరులో భార‌త్ అద్బుత విజ‌యాన్ని న‌మోదు…

    శాంస‌న్ ను ఆలింగ‌నం చేసుకున్న హిట్మెయ‌ర్

    Spread the love

    Spread the loveఇద్దరు ఆట‌గాళ్ల‌ది విడ‌దీయ‌లేని అనుబంధం కోల‌కోతా : క్రికెట్ కు జీవితానికి ద‌గ్గ‌రి సంబంధం ఉంది. ఇలాంటి అపురూప‌మైన క్ష‌ణాలు చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. ఇందుకు ప్ర‌త్య‌క్ష సాక్ష్యం కోల్ క‌తా వేదిక‌గా జ‌రిగిన ఇండియా వ‌ర్సెస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *