గ్లోబల్ హార్టీకల్చర్ హబ్ గా రాయ‌ల‌సీమ‌

Spread the love

ప్ర‌క‌టించిన మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ మేరకు రాయలసీమను గ్లోబల్ హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. వచ్చే మూడు సంవత్సరాల్లో 6 లక్షల హెక్టార్లను కొత్తగా ఉద్యాన పంటల కిందకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం 2026-27లో రూ.200 కోట్లు కేటాయించామని వెల్లడించారు. కొబ్బరి ప్రాసెసింగ్ పార్క్‌ను అమలాపురంలో ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. ఆయిల్ పామ్ సాగులో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని అన్నారు. 2025-26లో 20.01% OERతో మెట్రిక్ టన్నుకు రూ.20,680 ధర రైతులకు లభించిందన్నారు.

2026-27లో 35,000 హెక్టార్ల కొత్త విస్తరణ లక్ష్యంతో రూ.204 కోట్లు ప్రతిపాదించామని తెలిపారు అచ్చెన్నాయుడు. ఉద్యానశాఖకు 2026-27 సంవత్సరానికి రూ.1,123.86 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించామ‌న్నారు. రైతుల ఆదాయం పెంపుతో పాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఉద్యాన రంగాన్ని శక్తివంతం చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 2024-25లో 1.18 లక్షల హెక్టార్లు, 2025-26లో ఇప్పటివరకు 1.05 లక్షల హెక్టార్లలో డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలు అందించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచామని తెలిపారు. 2026-27లో 1.50 లక్షల హెక్టార్ల లక్ష్యంతో పాటు రూ.475 కోట్లతో సూక్ష్మసేద్యానికి చర్యలు చేపట్టామని వెల్లడించారు.

  • Related Posts

    ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం స‌బ‌బే

    Spread the love

    Spread the loveమ‌రాఠా మంత్రి గిరీష్ మ‌హాజ‌న్ కామెంట్స్ ముంబై : దేశ వ్యాప్తంగా సంచల‌నంగా మారారు మంత్రి మ‌రాఠాకు చెందిన గిరీష్ మ‌హాజ‌న్. వైరల్ అవుతున్న తన వీడియోపై బుధ‌వారం స్పందించారు. అది తప్పు అని నేను అనను అన్నారు.…

    రేపే త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల పోలింగ్

    Spread the love

    Spread the loveఏర్పాట్లు చేశామ‌న్న ఎన్నిక‌ల క‌మిష‌న్ చెన్నై | త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఈనెల 23న గురువారం ఎన్నిక‌ల‌కు సంబంధించి పోలింగ్ జ‌ర‌గ‌నుంది.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిణి అర్చన పట్నాయక్ మాట్లాడారు ఇవాళ. ఎంసీసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అడ్డగించిన మొత్తం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *