టి20 వరల్డ్ కప్ 2వ సెమీ ఫైనల్ మ్యాచ్ నేడు
ముంబై : అందరి కళ్లు ఇప్పుడు భారత జట్టుపైనే ఉన్నాయి. ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకునేందుకు ఇంకా ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది. ఫైనల్ కు చేరాలంటే సిసలైన సెమీ ఫైనల్ మ్యాచ్ లో సత్తా చాటాల్సి ఉంటుంది సూర్య భాయ్ సేన. ఇప్పటికే బ్యాటింగ్ పరంగా బలంగా ఉన్నప్పటికీ బౌలింగ్ కొంత ఇబ్బంది పెడుతోంది. గౌతం గంభీర్ కోచ్ గా ఉన్న జట్టు ఇప్పుడు చావో రేవో తేల్చుకునేందుకు సిద్దమైంది. కోల్ కతా వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో వెస్టిండీస్ భారీ స్కోర్ ను ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది టీమిండియా.
కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించాడు. విండీస్ ఆటగాళ్ల ఆశలపై నీళ్లు చల్లాడు. తను ఒక్కడే 97 రన్స్ చేశాడు. అత్యంత బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఇండియాను సెమీ ఫైనల్ కు చేర్చడంలో కీలక భూమిక పోషించాడు. మరో వైపు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ , ఇషాన్ కిషన్ , హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ లు కీ రోల్ పోషించాల్సి ఉంది. మరో వైపు ఎలాగైనా ఇండియాను ఓడించి ఫైనల్ కు చేరుకోవాలని ఇంగ్లండ్ ప్లాన్ వేస్తోంది. మరో వైపు కోల్ కతా వేదికగా జరిగిన తొలి సెమీస్ లో ఊహించని రీతిలో దక్షిణాఫ్రికా ను మట్టి కరిపించింది. 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.





