ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కు తనే అర్హుడు
ముంబై : ఇండియా టి20 వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకుంది. భారత జట్టు ఇంగ్లండ్ ను 7 పరుగుల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 రన్స్ చేసింది. అనంతరం ఇంగ్లండ్ కూడా చివరి ఓవర్ దాకా , గెలుపు అంచుల దాకా వచ్చింది. ఒకానొక దశలో గెలుస్తుందేమోనన్న అనుమానం కలుగచేసింది. దీనికి కారణం ఇంగ్లండ్ కు చెందిన 22 ఏళ్ల కుర్రాడు జాకబ్ బెథెల్. తను ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 48 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. 105 పరుగులు చేశాడు. చివరకు పాండ్యా విసిరిన బంతికి తను రనౌట్ అయి వెనుదిరిగాడు. ఒకవేళ తను గనుక మైదానంలో ఉంటే ఇండియా ఫైనల్ కు వెళ్లి ఉండక పోయేది.
ఇక సంజూ శాంసన్ సెన్సేషన్ ఇన్నింగ్స్ ఆడాడు మరోసారి. కోల్ కతా వేదికగా 97 పరుగులతో నాటౌట్ గా ఉన్న తను సెమీస్ కు చేర్చాడు. ఇక ముంబై వేదికగా జరిగిన సెమీస్ లో సైతం భారత్ భారీ స్కోర్ సాధించడంలో ముఖ్య భూమిక పోషించాడు. తను 42 బంతులు ఎదుర్కొని 89 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు 7 సిక్సర్లు ఉన్నాయి. మ్యాచ్ గెలుపొందిన అనంతరం శాంసన్ ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపిక చేశారు. దీనిపై స్పందించిన శాంసన్ తనకు కాదు ఇవ్వాల్సింది ఈ అవార్డును బుమ్రాకు దక్కాలన్నాడు. తనే ఈ మ్యాచ్ లో రియల్ హీరో అని ప్రశంసించాడు. శాంసన్ క్రీడా స్పూర్తికి ప్రతి ఒక్కరు జేజేలు పలుకుతున్నారు. తనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.





