బౌలర్లను ఉతికి ఆరేసిన ఇంగ్లండ్ క్రికెటర్
ముంబై : భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టు చివరి ఓవర్ దాకా పోరాడింది. ఆకాశమే హద్దుగా చెలరేగాడు యంగ్ క్రికెటర్ జాకబ్ బెథెల్. తను భారత బౌలర్లను ఉతికి ఆరేశాడు. కళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకున్నాడు. చివరకు అనుకోకుండా రనౌట్ కావడంతో ఇంగ్లండ్ ఆశలు ఆవరి అయ్యాయి. సామ్ కరన్ ఉన్నప్పటికీ ఏమీ చేయలేక పోయాడు. భారత జట్టు సమిష్టిగా రాణించింది. అటు బ్యాటింగ్ లో అదరగొట్టింది. ఇటు బౌలింగ్ లో సత్తా చాటింది. ఫీల్డింగ్ లో దుమ్ము రేపింది. దీంతో ప్రత్యర్థి జట్టు కేవలం 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టి20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. ఇంటి బాట పట్టింది.
ఇక ప్రత్యేకించి ఇంగ్లండ్ టీంలో చెప్పుకోవాల్సింది ఒకే ఒక్కడు. తనే జాకబ్ బెథెల్. తను ఆట తీరుతో మెస్మరైజ్ చేశాడు. భారతీయుల అభిమానుల మనసు దోచుకున్నాడు. కళ్లు చెదిరేలా షాట్స్ ఆడాడు. తక్కువ బంతులో సెంచరీ నమోదు చేశాడు. ఒక రకంగా టీమిండియాకు ముచ్చెమటలు పట్టించాడు.
బార్బాడియన్‌కు చెందిన జాకబ్ బెథెల్ 48 బంతుల్లో 105 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ రికార్డు బద్దలు కొట్టే లక్ష్యాన్ని చేరుకోవడానికి దగ్గరగా తీసుకు వచ్చాడు. కానీ ఆశించిన రీతిలో లక్ష్యానికి దగ్గరగా వచ్చినట్టే వచ్చి ఓటమి పాలైంది.





