సంజు శాంస‌న్ పై క‌న్నేసిన న్యూజిలాండ్

Spread the love

ఫైన‌ల్ మ్యాచ్ లో త‌ను ఒక్క‌డే కీల‌కం

అహ్మదాబాద్ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్న‌మెంట్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ఇవాల్టితో క‌థ క్లోజ్ అవుతుంది. టీం ఇండియాను క్లిష్ట ద‌శ‌లో ఉన్న స‌మ‌యంలో కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ గ‌ట్టెక్కించాడు. ప్ర‌త్య‌ర్థుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాడు. ఒక్క‌డే ఒంట‌రి పోరాటం చేశాడు. త‌ను ఒక్క‌డే యుద్దం చేశాడు. త‌న 11 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో ఎన్నో అవ‌మానాలు భ‌రించాడు. త‌ను ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చివ‌ర‌కు తాను ఏమిటో చూపించాడు. అవ‌స‌ర‌మైన స‌మయంలో స్త‌తా చాటాడు. ప్ర‌త్యేకించి కోల్ క‌తా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచ్ లో వెస్టిండీస్ కు చుక్క‌లు చూపించాడు.

మైదానంలో తొలి బంతి నుంచి ఆఖ‌రి ఓవ‌ర్ దాకా ఉన్నాడు. జ‌ట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. భ‌ళా అంటూ అంద‌రి చేతి జేజేలు పొందాడు. త‌ను 97 ర‌న్స్ చేశాడు. 50 బంతులు ఎదుర్కొని. ఇదే క్ర‌మంలో సెమీ ఫైన‌ల్ కు చేరిన భార‌త జ‌ట్టు అద్భుత విజ‌యం సాధించ‌డంలో సైతం కీల‌క రోల్ పోషించాడు. ఒక ర‌కంగా చెప్పాలంటే సంజు శాంస‌న్ తో పాటు అక్ష‌ర్ ప‌టేల్, శివ‌మ్ దూబే, తిల‌క్ వ‌ర్మ‌, పాండ్యా, జ‌స్ప్రీత్ బుమ్రా ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఇక శాంస‌న్ కేవ‌లం 42 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 8 ఫోర్లు 7 సిక్స్ ల‌తో హోరెత్తించాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. త‌ను 89 ర‌న్స్ చేశాడు.

  • Related Posts

    అంతిమ పోరులో విశ్వ విజేత ఎవ‌రో

    Spread the love

    Spread the loveఅహ్మ‌దాబాద్ లో ఇండియా వ‌ర్సెస్ కీవీస్ అహ్మ‌దాబాద్ : అంద‌రి క‌ళ్లు ఇప్పుడు అహ్మదాబాద్ పైనే ఉన్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో త‌ల‌ప‌డేందుకు సిద్ద‌మ‌య్యాయి న్యూజిలాండ్, భార‌త జ‌ట్లు. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ ప‌రంగా…

    సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్ ..?

    Spread the love

    Spread the loveజోరుగా క్రికెట్ వ‌ర్గాల‌లో చ‌ర్చ హైద‌రాబాద్ : ప్ర‌పంచ క్రికెట్ లోని పొట్టి ఫార్మాట్ లో అత్యంత విజ‌య‌వంత‌మైన స్కిప్ప‌ర్ గా పేరు పొందాడు ముంబైకి చెందిన సూర్య భాయ్ అలియాస్ సూర్య కుమార్ యాద‌వ్. త‌ను అద్భుత‌మైన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *