చంద్రబాబును విమర్శించే అర్హత జ‌గ‌న్ కు లేదు

VijayaBhaskar · March 9, 2026
Spread the love

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్

పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : కూటమి ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలతో పాటు స్థానికంగా పరిశ్రమల ఏర్పాటుతో కళ్లెదుటే బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటుంటే ఆ తల్లుల్లో ఆనందం వ్యక్తమవుతోందని అన్నారు మంత్రి ఎస్. స‌విత‌. మహిళలను సీఎం చంద్రబాబు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. అయిదేళ్లలో జగన్ బస్సు ఛార్జీలు పెంచితే, మేం ఫ్రీ బస్ సౌకర్యం కల్పించి మహిళలకు అండగా నిలిచాం అన్నారు. సీఎం చంద్రబాబు మహిళా పక్షపాతి అని పేర్కొన్నారు. ఆయనను విమర్శంచే అర్హత జ‌గ‌న్ రెడ్డికి లేద‌న్నారు. నువ్వు మ‌హిళా ద్రోహివి వంటూ మండిప‌డ్డారు ఎస్. స‌విత‌.

సొంత తల్లిని, చెల్లిని గౌరవించని వ్యక్తి రాష్ట్రంలో ఇతర మహిళలను ఉద్ధరిస్తారని ఎవరూ భావించడలేదని జగన్ నుద్దేశించి విమర్శించారు. పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా సాధికారత గురించి ఆలోచించింది మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బీర అంబేద్కర్, అన్న ఎన్టీఆర్, సీఎం చంద్రబాబేనని అన్నారు. మహిళలను అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంచాలన్నది సీఎం చంద్రబాబు సంకల్పమన్నారు. దీపం పథకం ద్వారా ఏడాదికి ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రతి ఇంటి నుంచి మహిళను పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో, ఎంఎస్ఎంఈ పార్కుల్లో అవకాశమిస్తున్నారని అన్నారు