విజేత‌కు ప‌ర్యాయ‌ప‌దం గౌతం గంభీర్

Spread the love

వ‌రుస‌గా రెండోసారి టి20 వ‌ర‌ల్డ్ క‌ప్

న్యూఢిల్లీ : భార‌త జ‌ట్టు వ‌రుస‌గా ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌డంతో ఒక్క‌సారి హెడ్ కోచ్ గా ఉన్న భార‌త జ‌ట్టు మాజీ క్రికెట‌ర్ గౌతం గంభీర్ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారు మ్రోగుతోంది. ఒక ర‌కంగా చెప్పాలంటే త‌ను ఎవ‌రి మాట విన‌డు. త‌ను అనుకున్న‌ది చేస్తాడు. త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ టీమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎవ‌రు ఏ స్థాయిలో ఉన్న‌ప్ప‌టికీ క‌ఠిన‌మైన శిక్ష‌ణ ఇచ్చేలా చేశాడు. దీంతో ఇండియా అద్బుత విజ‌యాలు న‌మోదు చేస్తూ వ‌చ్చింది. ఒకానొక స‌మ‌యంలో ఫామ్ లో లేక పోయిన‌ప్ప‌టికీ కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ కు మ‌రో ఛాన్స్ ఇచ్చాడు. త‌న‌పై ఉన్న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టాడు సంజు. ఈ టోర్నీలో ఏకంగా 321 ర‌న్స్ చేశాడు. ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపిక‌య్యాడు.

క్వార్ట‌ర్ ఫైన‌ల్, సెమీ ఫైన‌ల్ , ఫైన‌ల్ లో దుమ్ము రేపాడు. వ‌రుస‌గా 97, 89, 89 ప‌రుగుల‌తో స‌త్తా చాటాడు. ఇదిలా ఉండ‌గా మ‌రో వైపు తాను ఏరికోరి ఎంపిక చేసిన ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ సైతం ఆశించిన మేర రాణించ‌లేదు. క్రికెట్ ప్రేమికుల‌తో పాటు ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు, అన‌లిస్టులు సైతం త‌న‌ను త‌ప్పించాల‌ని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. కానీ ప‌ట్టించుకోలేదు. చివ‌ర‌కు అభిషేక్ శ‌ర్మ ఫైన‌ల్ లో న్యూజిలాండ్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. కేవ‌లం 18 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ చేశాడు. దీంతో గంభీర్ కు ఇప్పుడు వంద మార్కులు ప‌డ్డాయి.

  • Related Posts

    సంజు శాంస‌న్ వ‌ల్ల‌నే వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచాం

    Spread the love

    Spread the loveక్రిష్ణ‌మాచారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చెన్నై : మాజీ క్రిక‌టెర్ క్రిష్ణ‌మాచారి శ్రీ‌కాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు కేర‌ళ స్టార్ ప్లేయ‌ర్ సంజు శాంస‌న్ గురించి. త‌ను ఆడ‌క పోతే ఇండియా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచి ఉండేది కాద‌న్నాడు.…

    రికార్డుల కంటే నాకు దేశం ముఖ్యం : సంజు శాంస‌న్

    Spread the love

    Spread the loveతిరువ‌నంత‌పురంకు చేరుకున్న స్టార్ క్రికెట‌ర్ కేర‌ళ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అసాధార‌ణ‌మైన ఆట‌తీరుతో ఆక‌ట్టుకున్నాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్. త‌న స్వ‌స్థ‌లం తిరువ‌నంత‌పురం. టోర్నీలో త‌ను 321 ప‌రుగులు చేసి ప్లేయ‌ర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *