హైడ్రా ప్ర‌జావాణికి 32 ఫిర్యాదులు

అందాయ‌న్న వ‌ర్ల పాప‌య్య

హైద‌రాబాద్ : హైడ్రా ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ప్ర‌జా వాణికి 32 ఫిర్యాదులు అందిన‌ట్లు వెల్ల‌డించారు అద‌న‌పు సంచాల‌కులు వ‌ర్ల పాప‌య్య‌. ఆక్ర‌మ‌ణ‌దారుల క‌బ్జాల గురించి వాపోయారు బాధితులు. త‌మ‌కు వారి నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరారు. ఇదిలా ఉండా రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండల్ లో ని TNGO’s Colony పరిధిలో ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలం ఆక్రమణకు గురైందని స్థానికులు ఫిర్యాదు చేసారు. ప్లాట్ నంబర్ 311 ప్రాంతంలో సుమారు 300 గజాల ప్రభుత్వ ఖాళీ స్థలం ఉందని తెలిపారు. ఈ స్థలం గతంలో అధికారికంగా కేటాయించబడిన ప్లాట్ల మధ్యలో ఉన్న ప్రభుత్వ భూమిగా పేర్కొన్నారు. ఆక్రమణలను వెంటనే తొలగించి, ఆ స్థలాన్ని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు.

శంషాబాద్ లోని ఎం.బి. మిషన్ కంపౌండ్‌లో ఉన్న స‌మాదులు క‌బ్జాకు గురౌతున్నాయ‌ని HYDRAA ప్రజావాణి లో ఎం.బి. చర్చి, ఎం.బి. సమాధుల నిర్వహణ కమిటీ ప్రతినిధి ప‌విత్ర సాగ‌ర్ ఫిర్యాదు చేశారు. శంషాబాద్ గ్రామంలోని సర్వే నంబర్ 619లో ఉన్న చర్చి సమాధులకు స‌బంధించిన‌ భూమి శతాబ్దానికి పైగా చర్చికి చెందినదిగా ఉందని తెలిపారు. ఈ భూమి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ జాబితాలో కూడా నమోదై ఉందని పేర్కొన్నారు. అయితే కొందరు వ్యక్తులు సర్వే నంబర్ 618గా చూపిస్తూ రికార్డులను మార్పులు చేసి అక్రమ రిజిస్ట్రేషన్ పొందినట్లు ఆరోపించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అక్రమంగా కంచెలు వేయడం, నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతోందని వాపోయారు.

  • Related Posts

    బ్రిక్స్ దేశాల మ‌ధ్య వాణిజ్య సంబంధాలు అవ‌స‌రం

    న్యూఢిల్లీ: బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణల రంగాలలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే బ్రిక్స్ ఆర్థిక శక్తి దాదాపు రెట్టింపు వేగంతో విస్తరిస్తోందని పేర్కొన్నారు. బ్రిక్స్…

    విజ‌య‌వాడ‌ను ముంచెత్తిన భారీ వ‌ర్షం

    కృష్ణా జిల్లా : రాష్ట్ర వాతావ‌ర‌ణ శాఖ ఇప్ప‌టికే హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఈ మేర‌కు రాష్ట్ర స‌ర్కార్ అప్ర‌మ‌త్త‌మైంది. ఇప్ప‌టికే భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి విజ‌య‌వాడ‌లో. పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *