ఇరాన్ లొంగి పోయేందుకు సిద్ద‌మైంది

VijayaBhaskar · March 14, 2026
Spread the love

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా : అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇరాన్ పై భ‌గ్గుమ‌న్నారు.
తాము చేస్తున్న దాడులకు భయపడి పోయి ఇరాన్ లొంగి పోయేందుకు సిద్ధమైందని అన్నారు. 2 రోజుల కిందట G-7 దేశాల నేతలతో జరిగిన వర్చువల్ చర్చల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. యుద్ధం కొనసాగించాలా వద్దా అనేది నిర్ణయించేందుకూ ఇరాన్‌లో అధికారులెవరు బతికి లేరని ట్రంప్ చెప్పారు. లీడర్ అంటూ ఎవరూ లేరని.. అందుకే లొంగి పోవడం గురించి ఎవరూ ప్రకటించ లేదని పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా ఇరాన్ ప్ర‌భుత్వం అధికారికంగా యుద్దం గురించి ప్ర‌స్తావించింది. శ‌నివారం సీరియ‌స్ గా స్పందించింది. కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తాము ప‌ది రోజులు కాదు 10 ఏళ్లు అయినా స‌రే యుద్దం చేసేదుకు సిద్దంగా ఉన్నామ‌ని వెల్ల‌డించింది. అమెరికా చీఫ్ ట్రంప్ త‌మ గురించి చేసిన చ‌వ‌క‌బారు కామెంట్స్ అన్నీ పూర్తిగా అబ‌ద్ద‌మ‌ని, నిరాధార‌మ‌ని పేర్కొంది. తాము ఎవ‌రికీ లొంగే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేసింది ఇరాన్. అన్నీ కోల్పోయినా స‌రే తాము వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తి లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది స‌ర్కార్.