కేంద్ర స‌ర్కార్ నిర్వాకం కూలీల‌కు శాపం

Spread the love

నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిలా రెడ్డి

అమ‌రావ‌తి : కేంద్ర స‌ర్కార్ నిర్వాకం కార‌ణంగా కోట్లాది మంది కూలీల‌కు ఉపాధి లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (MGNREGA) చట్ట పరిరక్షణ యాత్ర పార్వతీపురం మణ్యం జిల్లాకు చేరుకుంది. ఈ సంద‌ర్బంగా ష‌ర్మిలాకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కురుపాం నియోజకవర్గం డంగభద్ర గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి హాజర‌య్యారు పెద్ద ఎత్తున‌ గ్రామస్థులు.

కరువు పని తోనే మణ్యం గ్రామాల్లో రోడ్లు వేసుకున్నామని, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించు కున్నామని , ఇప్పుడు ఉపాధి పనికి కనీసం వేతనాలు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మన్రేగా పథకానికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ తెచ్చిన VB G- RAM G చట్టానికి ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు ఈ సంద‌ర్బంగా ష‌ర్మిలా రెడ్డి. కాంగ్రెస్ చేస్తున్న ఉపాధి హామీ చట్ట పునరుద్ధరణకు కురుపాం నియోజక వర్గ ప్రజల మద్దతు తీసుకోవడం జరిగింది. పేద‌ల క‌డుపు నింపుతున్న ఉపాధి హామీ ప‌థ‌కాన్ని పున‌రుద్ద‌రించాల‌ని, కొత్త చ‌ట్టాన్ని ర‌ద్దు చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

  • Related Posts

    ప్ర‌జ‌ల ఆరోగ్యానికి అత్యున్న‌త ప్రాధాన్య‌త

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన డిప్య‌టీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క హైద‌రాబాద్ : ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జా ప్ర‌భుత్వం ప్ర‌జా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని చెప్పారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో…

    శాంతి, సామ‌ర‌స్యాల‌కు ప్ర‌తిబింబం రంజాన్

    Spread the love

    Spread the loveబీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్ రావు హైద‌రాబాద్ : ప‌ర‌మ‌త స‌హ‌నం, శాంతి సామ‌ర‌స్యాల‌కు ప్ర‌తీక రంజాన్ పండుగ అని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్ రావు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *