Friday, 16 October 2026

శాంస‌న్ వ్య‌క్తిగ‌త రికార్డుల కోసం ఆడ‌లేదు

newsseals-SuryaKuarYdav

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన సూర్య కుమార్

న్యూఢిల్లీ : భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ఆట తీరు ప‌ట్ల సంతృప్తి వ్య‌క్తం చేశాడు. ప్ర‌ధానంగా ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచు కోవడంలో కీల‌క‌మైన పాత్ర పోషించాడ‌ని ప్ర‌శంసించాడు. అంతే కాదు తాను గ‌నుక కోల్ క‌తాలో జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్ లో విండీస్ తో గ‌నుక 97 ర‌న్స్ చేయ‌క పోయి ఉంటే ఇండియా సెమీస్ కు చేరుకుని ఉండేది కాద‌న్నాడు. దేశ రాజ‌ధాని న్యూఢిల్లీ వేదిక‌గా బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన నమ్మాన్ అవార్డుల ప్ర‌ధాన కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యాడు. ఈ సంద‌ర్భంగా ఇదే వేదిక‌పై వ్యక్తిగత మైలురాళ్ల గురించి సూర్యకుమార్ యాదవ్ ప్రస్తావించాడు ప్ర‌త్యేకించి. త‌ను కేవ‌లం 5 ఇన్సింగ్స్ లు మాత్ర‌మే ఆడాడు. ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు.

ఇక జ‌ట్టులోని బ్యాటర్లందరూ తమ బాధ్యతను స్వీకరించారని పేర్కొన్నాడు సూర్య కుమార్ యాద‌వ్. 49 పరుగుల వద్దో లేదా 90ల దశలో ఉన్నప్పుడో వారు తమ వ్యక్తిగత మైలురాళ్ల గురించి ఆలోచించ లేదన్నాడు. సంజు శాంసన్ విషయమే తీసుకుంటే అతను రెండుసార్లు 80లు, ఒకసారి 97 పరుగులు సాధించాడు. ఆ సందర్భాల్లో అతను ఎంతో సులభంగా శతకాలు పూర్తి చేసుకోగలిగే వాడు, కానీ జట్టు పట్ల తనకున్న బాధ్యతను అతను చక్కగా అర్థం చేసుకున్నాడని ప్ర‌శంస‌లు కురిపించాడు కెప్టెన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *