హెడ్ కోచ్ గౌతం గంభీర్ కు అరుదైన గౌర‌వం

స్పోర్ట్స్ లీడ‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డు

న్యూఢిల్లీ : భార‌త క్రికెట్ జ‌ట్టును ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ కైవ‌సం చేసుకోవ‌డంలో కీల‌క పాత్ర పోషించారు భార‌త జ‌ట్టు మాజీ క్రికెట‌ర్, ప్ర‌స్తుత హెడ్ కోచ్ గౌతం గంభీర్ . ఈ సంద‌ర్బంగా భార‌తీయ ప్ర‌ముఖ మీడియా సంస్థ సీఎన్బీసీ టీవీ18 న్యూస్ ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్ ను బహూక‌రించింది. ఇందులో వివిధ రంగాల‌లో ప్ర‌త్యేకించి స్పోర్ట్స్ విభాగంకు సంబంధించిన ప్ర‌ముఖుల‌ను స‌త్క‌రించింది. ఇందులో భాగంగా వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా నిలిచిన భార‌త జ‌ట్టుకు సార‌థ్యం వ‌హించిన ముంబైకి చెందిన సూర్య కుమార్ యాద‌వ్ తో పాటు ప్ర‌ధాన కోచ్ గౌతం గంభీర్ ల‌ను ఎంపిక చేసింది.

ఈ ఇద్ద‌రి ప్ర‌ముఖుల‌కు వ‌రుస‌గా స్పోర్ట్స్ లీడర్ ఆఫ్ ది ఇయర్ , ఎక్సలెన్స్ ఇన్ స్పోర్ట్స్ అవార్డుల‌తో ఘ‌నంగా స‌త్కరించారు. ఈ పుర‌స్కారాల ప్ర‌ధాన కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు కేంద్ర వ్యాపార‌, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ . సూర్య కుమార్, గౌతం గంభీర్ ల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. భార‌త జ‌ట్టును స‌మ‌ర్థవంతంగా న‌డిపించ‌డంలో స్కై కీల‌క పాత్ర పోషించార‌ని, ఇదే స‌మ‌యంలో జ‌ట్టును మ‌రింత బ‌లవంతంగా చేయ‌డంలో ముఖ్య భూమిక వ‌హించారు గౌతం గంభీర్ అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *