గ‌వ‌ర్న‌ర్ స‌త్కారం సంజు శాంస‌న్ సంతోషం

Spread the love

భ‌విష్య‌త్తులో కేర‌ళ‌కు మంచి పేరు తేవాలి

కేర‌ళ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో అద్భుత‌మైన ఆట‌తీరుతో ఆక‌ట్టు కోవ‌డ‌మే కాదు నేష‌న‌ల్ హీరోగా మారి పోయాడు కేర‌ళ‌కు చెందిన స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్. త‌ను కేవ‌లం 5 ఇన్నింగ్స్ లు మాత్ర‌మే ఆడాడు వ‌రుస‌గా 22, 24, 97, 89, 89 ర‌న్స్ తో దుమ్ము రేపాడు. మొత్తం 321 ప‌రుగుల‌తో ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్ గా నిలిచాడు. అంతే కాదు ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు. ఆపై చ‌రిత్ర సృష్టించాడు. కేర‌ళ రాష్ట్రానికి గ‌ర్వ కార‌ణంగా నిలిచాడు సంజు శాంస‌న్. ఈ సంద‌ర్భంగా కేర‌ళ సీపీఎం పిన‌య‌ర్ విజ‌య‌న్ ప్ర‌భుత్వం త‌న‌ను ఘ‌నంగా స‌న్మానించింది.

అంత‌కు ముందు రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ లోక్ భవన్‌లో సంజు శాంసన్‌ను గ‌నంగా సత్కరించారు. గవర్నర్ సంజుకు శాలువా కప్పారు. ఆయనకు ఒక ‘కసవు ముండు’, శ్రీ పద్మనాభస్వామి విగ్రహం , సచిన్ టెండూల్కర్ ఆత్మకథ ‘Playing It My Way’లను బహూకరించారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్, సంజు శాంస‌న్ లు చాలా సేపు చ‌ర్చించారు. అనంత‌రం శాంస‌న్ మీడియాతో మాట్లాడాడు. త‌న‌ను స‌త్క‌రించినందుకు గ‌వ‌ర్న‌ర్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. శ‌క్తి వంచ‌న లేకుండా రాష్ట్రానికి మంచి పేరు తీసుకు వ‌చ్చేలా ఆడ‌తాన‌ని చెప్పాడు.

  • Related Posts

    క్రికెట‌ర్ తిల‌క్ వ‌ర్మ‌ను స‌త్క‌రించిన సీఎం

    Spread the love

    Spread the loveప్ర‌భుత్వం త‌నకు అండ‌గా ఉంటుంద‌ని హామీ హైద‌రాబాద్ : భార‌త క్రికెట్ కు చెందిన ఆట‌గాడు తిల‌క్ వ‌ర్మ మ‌ర్యాద పూర్వ‌కంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డిని క‌లిశారు. టి20 ప్రపంచ కప్-2026 లో భారత జట్టు…

    వైభ‌వ్ సూర్య‌వంశీ గ‌ట్స్ ఉన్న క్రికెట‌ర్

    Spread the love

    Spread the loveప్ర‌శంస‌లు కురిపించిన‌ సంజు శాంస‌న్ న్యూఢిల్లీ : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్, టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గ్ర‌హీత సంజు శాంస‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. త‌ను యంగ్ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *