20 ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌నే స‌ర్కార్ ల‌క్ష్యం

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి నారా లోకేష్

అమ‌రావ‌తి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో 20 ల‌క్ష‌ల‌కు పైగా ఉద్యోగాలు క‌ల్పించాల‌ని త‌మ కూట‌మి స‌ర్కార్ ల‌క్ష్యంగా పెట్టుకుంద‌ని వెల్ల‌డించారు. అమ‌రావ‌తిలోని మంగళగిరి సమీపం చినకాకానిలోని మయూరి టెక్ పార్క్ భవనం ఐదో అంతస్తులో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు( APEDB) నూతన కార్యాలయాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఏపీఈడీబీ సీఈవో సాయికాంత్ వర్మ, ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్, ఎండీ ఎమ్.అభిషిక్త్ కిషోర్, ఉన్నతాధికారులు ఎంటీ కృష్ణబాబు, సౌరభ్ గౌర్ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. రాష్ట్రంలో పేద‌రిక నిర్మూల‌న కోసం ప్ర‌భుత్వం శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తోంద‌ని చెప్పారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఐటీ, లాజిస్టిక్, త‌దిత‌ర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖ కంపెనీలు ఇక్క‌డ కొలువు తీరేలా ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని అన్నారు. ప్ర‌భుత్వం బ‌డా పారిశ్రామిక‌వేత్త‌ల‌కు స్వాగ‌తం ప‌లుకుతోంద‌న్నారు. గ‌త స‌ర్కార్ ఉద్యోగాల క‌ల్ప‌న విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌హించింద‌ని ఆరోపించారు. కానీ త‌మ కూట‌మి స‌ర్కార్ వ‌చ్చాక పెద్ద ఎత్తున కంపెనీలు ఏర్పాటు అవుతున్నాయ‌ని, ప్ర‌త్యేకించి ఐటీ సెక్టార్ లో శిక్ష‌ణ ఇచ్చి జాబ్స్ క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *