స్పష్టం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని ఈస్ట్ -వెస్ట్ కార్గో కారిడార్ గా అభివృద్ధి చేయాలని, ఇందు కోసం తక్షణమే అందుకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల్లో త్వరితగతిన కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్లు ప్రారంభం కావాలని నిర్దేశించారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై నేడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ మూడు పోర్టుల నుంచి ఒడిశా, చత్తీస్ఘఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణా, కర్ణాటకల హింటర్ ల్యాండ్ నుంచి కార్గో రవాణా జరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు సీఎం.
రామాయపట్నం నుంచి కడప స్టీల్ ప్లాంట్ వరకూ ప్రత్యేక మార్గాన్ని వేసేందుకు కూడా రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని ఈ సందర్బంగా చంద్రబబు నాయుడు తెలిపారు. రెండో దశలో బుడిగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్లను కూడా వేగంగా చేపట్టాలని ఆదేశించారు. ఈ సమీక్షలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, మారి టైమ్ బోర్డు సీఈఓ అభిషేక్ కుమార్ పాల్గొన్నారు.





