డైరెక్ట‌ర్ పై నోరా ఫ‌తేహి షాకింగ్ కామెంట్స్

VijayaBhaskar · March 19, 2026
Spread the love

స‌ర్కే చున‌ర్ తేరి స‌ర్కే పాట‌పై దుమారం

ముంబై : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి నోరా ఫ‌తేహి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తాజాగా త‌ను నటించిన స‌ర్కే చున‌ర్ తేరి స‌ర్కే పాట ప్ర‌స్తుతం తీవ్ర సంచ‌ల‌నం రేపింది. దీనిపై అభ్యంత‌రం వ్య‌క్తం అవుతోంది . పాట తీసిన‌, రాసిన‌, స్వ‌ర ప‌ర్చిన ప్ర‌తి ఒక్క‌రిపై అభిమానులు మండి ప‌డుతున్నారు. ఇదే క్ర‌మంలో పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త రావ‌డం, సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండ‌డంతో దీనిపై స్పందించారు న‌టి నోరా ఫ‌తేహి. ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడి నిర్వాకంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది న‌టి.

స‌ర్కే చున‌ర్ తేరి స‌ర్కే పాట చిత్రీక‌ర‌ణ విష‌జ్ఞంలో త‌మ‌కు స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని త‌న‌కు ముందే తెలుస‌ని అన్నారు . ఆ ద‌ర్శ‌కుడితో ఇది అస్స‌లు బాగోలేద‌ని పేర్కొన్నారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని ముందే ఊహించాన‌ని చెప్పింది. అందుకే నేను ఆ ప్రాజెక్టు నుండి పూర్తిగా తప్పుకున్నానని స్ప‌ష్టం చేసింది న‌టి నోరా ఫ‌తేహి. మీరు గమనించినట్లుగానే, నేను ఆ పాటను అస్సలు ప్రమోట్ చేయలేదన్నారు. నేను మళ్ళీ ఆ విషయాన్ని దర్శకుడి దృష్టికి తీసుకెళ్లాను. ‘నా ఇమేజ్, నా పరువు పణంగా ఉన్నాయి’ అని నేను ద‌ర్శ‌కుడితో కుండ బ‌ద్ద‌లు కొట్టాన‌ని తెలిపింది.