కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్ జిల్లా : ఆదిత్య ధర్ తీసిన దురంధర్ -2 మూవీ ఇప్పడు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కాసుల వర్షం కురిపిస్తోంది. మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది ఈ మూవీ. ఇందుల్ ముఖ్య పాత్రలు పోషించారు రణ్ వీర్ సింగ్ , సారా అర్జున్. సినీ రంగం విస్తు పోయేలా కాసుల వర్షం కురిపిస్తోంది ఈ మూవీ. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఆశించిన దానికంటే అత్యధికంగా కలెక్షన్లు వస్తాయని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దురంధర్-2 సినిమా అద్భుతంగా ఉందంటూ పేర్కొన్నాడు. ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమా చూడక పోతే చాలా మిస్ అవుతామని అభిప్రాయం వ్యక్తం చేశాడు ఆర్జీవీ.
తాజాగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ దురంధర్ -2 మూవీని చూశారు థియేటర్ లో. తన అభిప్రాయాలను పంచుకున్నారు. దేశభక్తిని ఎంతో దృఢ విశ్వాసంతో ప్రదర్శించారు. సినిమా అంతటా ఎన్నో ప్రశంసనీయమైన సన్నివేశాలు ఉన్నాయని కితాబు ఇచ్చారు. నిజంగా ఎంతో ప్రభావవంతంగా, ఆకట్టుకునేలా ఉందన్నారు కేంద్ర మంత్రి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న ఎన్నో నిర్ణయాలు కాలక్రమేణా మరింత బాగా అర్థమవుతాయనే విషయాన్ని ప్రతిబింబింబించేలా తీశారంటూ పేర్కొన్నారు .







