అంద‌రి క‌ళ్లు సంజు శాంస‌న్ పైనే

రాజ‌స్తాన్ రాయ‌ల్స్ తో కీల‌క పోరు

గౌహ‌తి : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో భాగంగా అత్యంత కీల‌క‌మైన మ్యాచ్ కు వేదిక కానుంది గౌహ‌తి. ఇప్ప‌టికే టోర్నీలో భాగంగా రెండు మ్యాచ్ లు పూర్త‌య్యాయి. తొలి మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ను ఓడించింది. ఇక రెండో మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ చేతిలో అజింక్యా ర‌హానే సార‌థ్యంలోని కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ప‌రాజ‌యం పొందింది. ఇక కీల‌క‌మైన మ‌రో లీగ్ మ్యాచ్ ఇవాళ రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ రియాన్ ప‌రాగ్ నేతృత్వంలోని రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది.

గ‌త కొన్నేళ్లుగా రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తూ వ‌చ్చాడు స్టార్ కేర‌ళ క్రికెట‌ర్ సంజు శాంస‌న్. ఇదే క్ర‌మంలో ఊహించని విధంగాను త‌ను ఆ జ‌ట్టును వ‌దిలి పెట్టాడు. ట్రేడింగ్ లో త‌న‌ను సీఎస్కే యాజ‌మాన్యం తీసుకుంది. త‌మ జ‌ట్టు నుంచి కీల‌క‌మైన ఇద్ద‌రు క్రికెట‌ర్లు సామ్ క‌ర‌ణ్ , ర‌వీంద్ర జ‌డేజాల‌ను వ‌దులుకుంది. ఏకంగా సంజు శాంస‌న్ ను రూ. 18 కోట్ల‌కు కొనుగోలు చేసింది. ఇవాళ జ‌రిగే మ్యాచ్ అత్యంత కీల‌కం కానుంది శాంస‌న్ కు. ఎలా ఆడ‌తాడ‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

  • Related Posts

    ఆట‌గాళ్ల‌పై గౌతం గంభీర్ కు న‌మ్మ‌కం లేదు : సురేష్ రైనా

    చెన్నై : భార‌త జ‌ట్టులో వ‌రుసగా మార్పులు చోటు చేసుకోవడం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ఆట‌గాడు సురేష్ రైనా. ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. ప్ర‌ధానంగా జ‌ట్టు హెడ్ కోచ్ గా ఉన్న…

    వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపిక క‌రెక్టు కాదు

    హైద‌రాబాద్ : ప్ర‌ముఖ క్రికెట్ అనలిస్ట్, కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంగ్లండ్ టూర్ లో భాగంగా శ్రేయ‌స్ అయ్య‌ర్ నాయ‌క‌త్వంలో టీమిండియా టి20 సీరీస్ ను కోల్పోయింది. ఆఖ‌రి మ్యాచ్ లోనూ చేతులెత్తేశారు. ప్ర‌ధాన ఆట‌గాళ్లు ఆశించిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *