Friday, 16 October 2026

ఆట‌గాళ్ల‌పై గౌతం గంభీర్ కు న‌మ్మ‌కం లేదు : సురేష్ రైనా

newsseals-SureshRaina

చెన్నై : భార‌త జ‌ట్టులో వ‌రుసగా మార్పులు చోటు చేసుకోవడం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ఆట‌గాడు సురేష్ రైనా. ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. ప్ర‌ధానంగా జ‌ట్టు హెడ్ కోచ్ గా ఉన్న గౌతం గంభీర్ పై సీరియ‌స్ కామెంట్స్ చేశాడు. ఎవ‌రైనా కోచ్ గా ఉన్న వాళ్లు ఆట‌గాళ్ల ఎంపిక‌తో పాటు ఎంపిక చేసిన వారిలో ఆత్మ విశ్వాసం , సానుకూల దృక్ఫ‌థం ఉండేలా చూడాల్సి ఉంటుంద‌న్నాడు. లేక పోతే ఫ‌లితాలు ఆశించిన రీతిలో రావ‌న్నాడు. ఈ సంద‌ర్బంగా సీరియ‌స్ కామెంట్స్ చేశాడు హెడ్ కోచ్ పై. ఆటగాళ్లపై గౌతమ్ గంభీర్‌కు నమ్మకం లేకపోవడమే అతిపెద్ద సమస్యగా ఇప్పుటు టీమిండియాకు మారింద‌ని ఆరోపించాడు సురేష్ రైనా.

మీరు T20 ప్రపంచ కప్‌ను ఘనంగా గెలుచుకున్నారు. కానీ, ప్రతి మ్యాచ్‌లోనూ మార్పులు ఎందుకు చేస్తున్నార‌ని ప్ర‌శ్నించాడు గంభీర్ ను ఉద్దేశించి. అంటే, ఏ ఫార్మాట్ అయినా సరే గౌతమ్ గంభీర్‌కు తన ఆటగాళ్లపై నమ్మకం లేదని అర్థం అని పేర్కొన్నాడు. మీకు 8వ స్థానం వరకు బ్యాటర్లు అవసరం, అలాగే బ్యాటింగ్ , బౌలింగ్ రెండూ చేయగల ఆటగాళ్లు కావాలి. తమ సొంత ప్రతిభతో మ్యాచ్‌లను గెలిపించగల స్పెషలిస్ట్ ఆటగాళ్లు మనకు అవసరం అని స్ప‌ష్టం చేశాడు సురేష్ రైనా. ఇలాంటి ఆటగాళ్లు (ఆల్ రౌండర్ల వంటి వారు మాత్రమే) ఎప్పుడూ క్రమం తప్పకుండా మ్యాచ్‌లను గెలిపించ లేరన్నాడు. 2027 వన్డే ప్రపంచ కప్‌లో కూడా రాణించాలంటే, మీరు ఇలాంటి అనవసరమైన మార్పులను ఆపాలని నొక్కి చెప్పారు రైనా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *