రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై ఊహాగానాలకు తెర‌

ముంబై : భార‌త క్రికెట్ కు చెందిన మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఈ ఆదివారం లార్డ్స్ లో ఇంగ్లండ్ తో జ‌రిగే చివ‌రిది మూడో వ‌న్డే అవుతుంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. త‌న‌ను బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ త‌న‌ను రిటైర్ అవ్వాల్సిందిగా కోరార‌ని, అంతే కాకుండా హెడ్ కోచ్ గౌతం గంభీర్ రోహిత్ శ‌ర్మ‌ను కొన‌సాగించేందుకు ఒప్పుకోవ‌డం లేదంటూ పెద్ద ఎత్తున టాక్ వ‌చ్చింది. అయితే 2027లో ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే సెలెక్ష‌న్ క‌మిటీ క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ త‌రుణంలో ఫామ్ లో ఉన్న రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల‌ను కొన‌సాగిస్తారా లేక పక్క‌న పెడ‌తారా అన్న‌ది ఇంకా తేలాల్సి ఉంది. ఈ త‌రుణంలో తాను వ‌ర‌ల్డ్ క‌ప్ కు అందుబాటులో ఉండ‌డం లేదంటూ రోహిత్ శ‌ర్మ బీసీసీఐకి తెలియ చేసిన‌ట్లు స‌మాచారం.

ఈ మొత్తం వ్య‌వ‌హారంపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది బీసీసీఐ. రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై స్పందించారు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా. లార్డ్స్ వన్డే రోహిత్‌కు చివరి మ్యాచ్ కాదని స్పష్టం చేశారు. ముంబైలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రోహిత్ శర్మ భారత్ తరఫున కొనసాగుతారని నొక్కి చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. అయితే రోహిత్ రిటైర్మెంట్‌పై అధికారిక ప్రకటన ఏదీ లేదని అన్నారు. ఇవ‌న్నీ పుకార్లేనంటూ కొట్టి పారేశారు దేవ‌జిత్ సైకియా.

  • Related Posts

    తమిళనాడు క్రీడా మౌలిక సదుపాయాల సమూల ప్రక్షాళన

    చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రంలోని 38 జిల్లాల్లో ఆధునిక క్రీడా వసతి గృహాలు (హాస్టల్స్), మెరుగైన స్టేడియంలు , ప్రాంతాల వారీగా అభివృద్ధి ప్రణాళికలతో సహా క్రీడా మౌలిక సదుపాయాలను సమూలంగా ఆధునీకరించనున్నట్లు మంత్రి ఆధవ్ అర్జున ప్రకటించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ…

    తెలంగాణ‌లో రూ. 30 కోట్ల‌తో క్రీడా స‌దుపాయాల క‌ల్ప‌న

    హైద‌రాబాద్ : తెలంగాణ‌కు ఖేలో ఇండియా యూత్ పోటీల నిర్వ‌హ‌ణ‌ను కేటాయించ‌డం ప‌ట్ల పీఎం మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దాదాపు రూ.30 కోట్లతో క్రీడా సదుపాయాల‌ కల్పన జరిగిందన్నారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *