న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ను ప్రక్షాళన చేస్తున్నారా. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ వ్యవహారం కలకల రేపింది. తన స్వంత కూతురు కొండా సుస్మితా పటేల్ సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై, ఆయన బ్రదర్స్ పై. ఏకంగా రూ. 200 కోట్లకు ఎసరు పెట్టారని మండిపడ్డారు. ఇది తీవ్ర చర్చకు దారితీసింది. ఆపై షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు మంత్రి కొండా సురేఖకు. దీనిపై ఆమె గట్టిగానే సమాధానం ఇచ్చారు. దీంతో తన మాట చెల్లుబాటు కావడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి హుటా హుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఎలాగైనా సరే బీసీ వర్గానికి చెందిన కొండా సురేఖను తొలగించాల్సిందేనని పట్టు పట్టినట్టు టాక్.
తెలంగాణ కాంగ్రెస్ మంత్రివర్గం నుండి కొండా సురేఖను తొలగించడం ఖాయమని ప్రచారం జరుగతోంది. ఇదిలా ఉండగా ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో తను భేటీ అయ్యారు. మరో వైపు ఆమెతో ముందే రాజీనామా చేయించాలా లేక మంత్రివర్గ విస్తరణ సమయంలో గౌరవ ప్రదంగా పక్కన పెట్టాలా అనే అంశంపై పార్టీ అధిష్టానం ప్రస్తుతం వ్యూహరచన చేస్తోంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్‌తో చర్చించినట్లు సమాచారం.మంత్రివర్గం నుండి కొండా సురేఖను తొలగించడం వల్ల తలెత్తే రాజకీయ , బీసీ వర్గాల పరమైన పరిణామాలను ఈ ఇద్దరూ సమగ్రంగా విశ్లేషించారు. కేవలం సురేఖను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం వల్ల వెలువడే ప్రతికూల సంకేతాలను నివారించేందుకు, పూర్తి స్థాయి మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా ఆమెను తొలగించే అవకాశం ఉంది. AICC ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో చర్చలు పూర్తయ్యాయి. మంత్రివర్గ విస్తరణ . సురేఖ భవిష్యత్తుపై రేపటి లోగా ఓ స్పష్టత రానుంది.





