Thursday, 15 October 2026

మేధావి బిధూరి సోష‌ల్ మీడియాలో వైర‌ల్

newsseals-MedhaiiBidhuri

ఢిల్లీ : మ‌హిళా క్రికెట్ రంగంలో మ‌రో తార వెలుగులోకి వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు మేధావి బిధూరి సెన్సేష‌న్ గా మారారు. సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. త‌ను అనుకోకుండా చేసిన హావ‌భావాల‌తో కూడిన వీడియోలు ఇప్పుడు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం మహిళల క్రికెట్‌లో వేగంగా గుర్తింపు పొందుతున్న ఢిల్లీకి చెందిన రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్. ఆమె చేసిన ప్రత్యేకమైన “6-7” వికెట్ సెలబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆగస్టు 20న Central Delhi Queens vs South Delhi Superstarz మ్యాచ్‌లో South Delhi Superstarz బ్యాటర్ నిషికా సింగ్ వికెట్ తీసిన తర్వాత మేధావి బిధూరి “6-7” స్టైల్‌లో సెలబ్రేట్ చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది.

ఆమె ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 2/24 బౌలింగ్ గణాంకాలు నమోదు చేశారు. మేధావి బిధూరి సాధారణంగా No. 12 జెర్సీ ధరించాలని అనుకున్నారని, కానీ ఆ నంబర్ అందుబాటులో లేక పోవడంతో ఆమె చెల్లెలు 67 నంబర్ తీసుకోవాలని సూచించారని త‌ను స్వయంగా వెల్ల‌డించారు. అదే “6-7” ట్రెండ్‌కు అనుసంధానమై ప్రత్యేక సెలబ్రేషన్‌గా మారింది. ఇదిలా ఉండ‌గా 2025 Delhi Premier Leagueలో South Delhi Superstarz తరఫున ఆడింది మాధ‌వి బిధూరి. ఫైనల్‌లో Central Delhi Queensపై 3/26తో అద్భుతంగా బౌలింగ్ చేశారు. South Delhi Superstarz కేవలం ఒక్క పరుగు తేడాతో టైటిల్ గెలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *