సామాజిక సేవలు చేసేందుకు ఛాన్స్ ఇవ్వాలి
హైదరాబాద్ : మాజీ కేంద్ర మంత్రి , ప్రముఖ యానిమల్ రైట్స్ యాక్టివి మేనకా గాంధీతో పాటు బృందం హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.
మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారి బృందానికి వివరించారు . గోసంరక్షణకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించిన విషయాన్ని ఆమెకు వివరించారు ఈ సందర్బంగా సీఎం.
ఎన్కేపల్లిలో గోశాల నిర్మాణానికి ఇప్పటికే శంకుస్ధాపన చేశామని తెలిపారు. రాష్ట్రంలో వివిధ ఆలయాల సమీపంలో గోశాలల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం జంతు సంరక్షణ విషయంలో తీసుకుంటున్న చర్యల పట్ల మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు పాల్గొన్నారు.





