ఫెస్టివ‌ల్ లో పాల్గొన‌డం ఆనందంగా ఉంది

Spread the love

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన న‌టి సంయుక్త మీన‌న్
న్యూఢిల్లీ : ప్ర‌ముఖ న‌టి సంయుక్త మీన‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌ను అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు. ఇవాళ చాలా సంతోషంగా ఉంద‌న్నారు. నేను ఇండియన్ పనోరమా చిత్ర పరిశ్రమలో నటిగా ఉన్నా. ప‌లు కీల‌క సినిమాల‌లో వివిధ‌, విభిన్న‌మైన పాత్ర‌లు పోషించాన‌ని చెప్పారు. అంతే కాకుండా అనేక దక్షిణాది భాషలలో నటించానని తెలిపారు సంయుక్త మీన‌న్. IFFDలో ప్రదర్శించబడుతున్న నా చిత్రం ‘విరూపాక్ష’ను నిర్మించిన నా నిర్మాత బాపీ సర్ తో కూడా ఇక్క‌డ ఉండ‌టం మ‌రింత ఆనందంగా ఉంద‌న్నారు.

సినిమాలో న‌టించ‌డం, ఛాన్స్ ఇచ్చినందుకు నిర్మాత‌కు తాను మొద‌ట థ్యాంక్స్ తెలియ చేసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు న‌టి సంయుక్త మీన‌న్. ఇది నాకు ఇష్టమైన చిత్రాలలో ఒకటి అని చెప్పారు. నేను పోషించిన ఉత్తమ పాత్రలలో ఒకటి అని పేర్కొన్నారు. ఢిల్లీలో ఇంత అందంగా, అద్భుతంగా ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ను నిర్వ‌హించ‌డం ప‌ట్ల ఆనందం ఉంద‌న్నారు. చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నిర్వాహ‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప్ర‌త్యేకించి త‌న‌ను రిసీవ్ చేసుకున్న విధానం మ‌రింత సంతోషం క‌లిగించింద‌ని చెప్పారు న‌టి సంయుక్త మీన‌న్.

  • Related Posts

    సీఎం జోసెఫ్ విజ‌య్ డ్యాన్స్ వీడియో వైర‌ల్

    Spread the love

    Spread the loveత్వ‌ర‌లో రిలీజ్ కానున్న జ‌న నాయ‌గ‌న్ చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రానికి నూత‌న సీఎంగా ఎన్నికైన ప్ర‌ముఖ న‌టుడు విజ‌య్ చంద్ర‌శేఖర్ ఇప్పుడు వైర‌ల్ గా మారారు. త‌ను చివ‌రిసారిగా న‌టించిన జ‌న నాయ‌గ‌న్ చిత్రంలో భాగంగా సింగ‌పూర్…

    త‌మిళ‌నాడు భూమి పుత్రుడు జోసెఫ్ విజ‌య్

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన న‌టి స‌న‌మ్ శెట్టి చెన్నై: జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంద‌ర్బంగా సినీ ప్ర‌ముఖులు పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు. తమిళ నటి సనమ్ శెట్టి ఇలా అన్నారు. ఈ రోజు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *