కీలక వ్యాఖ్యలు చేసిన నటుడు అడవి శేష్
హైదరాబాద్ : నటుడు అడవి శేష్ నటించిన డెకాయిట్ పై అంచనాలు పెరిగాయి. ఇందుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఏంట్రా చిరంజీవిలా, మహేష్ బాబులా ఫీల్ అవుతున్నావ్ అని బయట అంటుంటారు కదా అన్న ప్రశ్నకు అడవి శేష్ చాలాతెలివిగా సమాధానం ఇచ్చారు. అగ్ర హీరోలను స్ఫూర్తిగా తీసుకోవడం, వారిలా ఉండాలని అనుకోవడంలో తప్పులేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రిన్స్ మహేష్ బాబు అంటే నాకు ఇష్టం. తనతో వ్యక్తిగతమైన బంధం ఉందన్నాడు.ఇందుకు సంబంధించి అడవి శేష్ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి నెట్టింట్లో.
మరో వైపు డెకాయిట్ లో అడవి శేష్ నటన పీక్ స్టేజ్ కు చేరింది. ఎవరూ ఊహించని విధంగా ఈ చిత్రంపై విపరీతమైన బజ్ వచ్చింది. ఎలాంటి క్యాంపెయిన్ , ఎక్కువ ప్రచారం లేకుండానే సినిమా ట్రైలర్ కుమ్మేసింది. అంచనాలు పెరిగేలా చేసింది. మొత్తంగా కంటెంట్ ఉంటే సినిమాలకు ఎవరి ప్రమోషన్స్ అక్కర్లేదని తేలి పోయింద ఈ డెకాయిట్ మూవీతో. మొత్తంగా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో అడవి శేష్ ఓ చర్చనీయాంశంగా మారి పోవడం విస్తు పోయేలా చేస్తోంది సినీ వర్గాలను.







