ఇక అమ‌రావ‌తిని ఎవ‌రూ మార్చ‌లేరు – శ్రీ‌

Spread the love

జ‌గ‌న్ పై నిప్పులు చెరిగిన బండారు శ్రావ‌ణి

అనంత‌పురం జిల్లా : ఎన్ని కుట్ర‌లు చేసినా చివ‌ర‌కు అంతిమంగా ధ‌ర్మ‌మే గెలిచింద‌ని అన్నారు సింగ‌న‌మ‌ల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్దత వచ్చిన సందర్భంగా పార్లమెంటులో సహకరించిన పార్టీలకు, నేతలకు, భారతదేశం, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తు అనంతపురం జిల్లా , శింగనమల నియోజకవర్గ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి దీపాలు వెలిగించారు ఎమ్మెల్యే. ప్రజా రాజధాని అమరావతి కి దీ పహారతులు ఇచ్చారు.

అమరావతి బిల్లుకు ఉభయ సభలలో ఆమోదం లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. ఇది ప్రజా రాజధాని అని.. నా రాజధాని అమరావతి అంటూ గర్వంగా చాటాల‌ని పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం సాధించిన విజయంగా అభివ‌ర్ణించారు. రాష్ట్ర రాజధాని అమరావతి పై వైసీపీ నేత జగన్ విషం కక్కడం మానాల‌ని హిత‌వు ప‌లికారు. ప్రజలు కోరిన ప్రజా రాజధానికి మద్దతు పలికేందుకు జగన్ కు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు. అమరావతి రాజధానికి సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రధాని నరేంద్ర మోడీకి,కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, మంత్రి నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు.

  • Related Posts

    సింగరేణిని కాపాడుకునేందుకు ఉద్యమిస్తాం

    Spread the love

    Spread the loveప్ర‌క‌టించిన మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత హైద‌రాబాద్ : సింగ‌రేణి సంస్థ‌ను కాపాడుకునేందుకు ఉద్య‌మిస్తామ‌ని హెచ్చ‌రించారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి , హెచ్ఎంఎస్ అధ్యర్యంలో నిర్వహించిన…

    విద్యుత్ రంగానికి ఏఐ ఒక గేమ్-ఛేంజర్

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన న‌వీన్ మిట్ట‌ల్ హైద‌రాబాద్ విద్యుత్ రంగానికి ఏఐ ఒక గేమ్ ఛేంజ‌ర్ కాబోతోంద‌ని అన్నారు ఇంధ‌న శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌వీన్ మిట్ట‌ల్. ఉత్తర డిస్కామ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *