ఏపీలో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు కొర‌త లేదు

Spread the love

స్ప‌ష్టం చేసిన మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్

విజ‌య‌వాడ : వేస‌వి కాలంలో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర విద్యుత్, ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్. బుధ‌వారం విజయవాడలో రూ.30 కోట్లతో నూతనంగా నిర్మించిన APCPDCL కార్పొరేట్ కార్యాలయం విద్యుత్ నిలయం భవనాన్ని ఎంపీ కేశినేని చిన్ని , స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, ముఖ్యమంత్రి ఎక్స్-అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ , సీఎండీ శ్రీ పుల్లారెడ్డి తో కలిసి ప్రారంభించారు. దీనిని ప్రార‌భించ‌డం సంతోషంగా ఉందన్నారు. నీటి కొర‌త‌కు ఇబ్బంది లేకుండా విద్యుత్ స‌ర‌ఫ‌రా రైతుల‌కు అందుతోంద‌ని తెలిపారు గొట్టి పాటి ర‌వికుమార్.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాల మేరకు రాష్ట్ర ప్రజలపై అదనంగా ఒక్క రూపాయి కరెంట్ ఛార్జీల భారం మోపకుండా, నిరంతరమైన, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అంకితభావంతో పని చేస్తున్నారని ప్ర‌శంస‌లు కురిపించారు ర‌వికుమార్. PM సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన , ‘PM కుసుమ్ యోజన’ వంటి కీలక పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో కూడా వారు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు.

  • Related Posts

    టీవీకే పార్టీకి భారీ షాక్ ఇచ్చిన ఈసీ

    Spread the love

    Spread the loveఎడప్పాడిలో నామినేషన్ రద్దు చెన్నై : ద‌ళ‌ప‌తి విజ‌య్ సార‌థ్యంలోని టీవీకే పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈనెల 23వ తేదీన త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు టీవీకే పార్టీ…

    పారిశ్రామిక వేత్తలు గా మహిళలు రాణించాలి

    Spread the love

    Spread the loveపిలుపునిచ్చిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి స‌వితఅమ‌రావ‌తి : మ‌హిళ‌లు లేకపోతే ప్ర‌పంచ‌మే లేద‌న్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. బుధ‌వారం అమ‌రావ‌తి లోని నాగార్జున యూనివ‌ర్శిటీ ఆడిటోరియంలో ఎంఎస్ఎంఈల‌పై ఒక రోజు వ‌ర్క్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *