newsseals.com
News

పారిశ్రామిక వేత్తలు గా మహిళలు రాణించాలి

VijayaBhaskar April 8, 2026
newsseals-SSavitha
Spread the love

పిలుపునిచ్చిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి స‌విత
అమ‌రావ‌తి : మ‌హిళ‌లు లేకపోతే ప్ర‌పంచ‌మే లేద‌న్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. బుధ‌వారం అమ‌రావ‌తి లోని నాగార్జున యూనివ‌ర్శిటీ ఆడిటోరియంలో ఎంఎస్ఎంఈల‌పై ఒక రోజు వ‌ర్క్ షాప్ నిర్వ‌హించారు. దీనిని మంత్రి ప్రారంభించి ప్ర‌సంగించారు. గ‌తంలో మ‌హిళ‌లు బ‌య‌ట‌కు వ‌చ్చే వారు కాద‌ని, కానీ మారుతున్న ప‌రిస్థితుల కార‌ణంగా వారంతా ఇప్పుడు అన్ని రంగాల‌లో కీల‌క‌మైన ప‌ద‌వుల‌లో ఉన్నార‌ని , త‌మ‌ను తాము నిరూపించుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అన్నారు ఎస్. స‌విత‌. ఇదే క్ర‌మంలో పారిశ్రామిక వేత్తలు గా మహిళలు రాణిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి తెలిపారు.

రాష్ట్ర ఈడబ్ల్యూఎస్ శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి కె.సునీత మాట్లాడుతూ,అగ్ర కులాల్లో పేదరికంతో బాధపడే వారిని ఆర్థికంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతకు ముందు ఆడిటోరియంలో వివిధ సంస్థలకు చెందిన తొమ్మిది స్టాళ్లను మంత్రి సవిత పరిశీలించారు. పరిశ్రమల ఏర్పాటుకు వారు అందిస్తున్న తోడ్పాటును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ సీఈవో ఎం.విశ్వ, వీసీ గంగాధర్ రావు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు బుచ్చి రాంప్రసాద్, బ్రహ్మం చౌదరి, డైరెక్టర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయులు తదితరులు పాల్గొన్నారు.