ఆశా బోస్లే గాత్రం అజ‌రామ‌రం

VijayaBhaskar · April 12, 2026
Spread the love

వ‌య‌సు మ‌ళ్లినా వెంటాడే పాట‌లు

ముంబై : బాలీవుడ్ లో విషాదం అలుముకుంది. దిగ్గ‌జ గాయ‌నిమ‌ణి ఆశా బోస్లే క‌న్నుమూశారు ఇవాళ‌. నిన్న ఛాతి నొప్పి రావ‌డంతో ముంబైలో ఆస్ప‌త్రిలో చేరారు. ఆదివారం మ‌ధ్యాహ్నం తుది శ్వాస విడిచిన‌ట్లు కుటుంబీకులు వెల్ల‌డించారు. రేపు గాయ‌నికి అధికారికంగా అంత్య‌క్రియ‌ల కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇక భారతదేశంలో అత్యంత గొప్ప గాయని లలో ఒకరైన ఆశా భోస్లే వేలాది పాటలు పాడారు. వాటిలో చాలా పాపుల‌ర్ సాంగ్స్ ఉన్నాయి. ముఖ్యంగా త‌న సోద‌రి ల‌తా మంగేష్క‌ర్ ను త‌ట్టుకుని నిల‌బ‌డ్డారు. త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నారు.

హ‌రే రామ హ‌రే కృష్ణ మూవీలో ద‌మ్ మరో ద‌మ్, కార‌వాన్ లో పియా తు అబ్ తో ఆజా, యాదోంకీ బారాత్ లో చురా లియా హై తుమ్నే, ఉమ్రా జావ్ సినిమాలో ఇన్ ఆంఖోకి మ‌స్తీ, డాన్ లో యెహ్ మేరా దిల్ , ఉమ్రా జావ్ లో దిల్ ఛీజ్ క్యా హై, మేరా కుస్ సామాన్ , ల‌గాన్ లో రాధా కైసే నా జ‌లే, ఆవో హుజూర్ తుమ్ కో , త‌దిత‌ర పాట‌లు జ‌నాన్ని ఉర్రూత లూగించేలా చేశాయి. మొత్తంగా దిగ్గ‌జ గాయ‌నిని కోల్పోవ‌డం భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌కు తీరని లోటు అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుందాం.