తెలంగాణ రాష్ట్ర మంత‌టా భ‌గ భ‌గ

VijayaBhaskar · April 13, 2026
Spread the love

వ‌డ‌గాల్పుల‌తో జ‌నం భ‌యం

హైద‌రాబాద్ : ఎండ వేడిమి అంత‌కంత‌కూ ఎక్కువ‌వుతోంది. వ‌డ‌గాల్పుల తాకిడి పెరుగుతోంది. దీంతో రాష్ట్ర వాతావ‌ర‌ణ శాఖ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. ఈ మేర‌కు సోమ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త‌గు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని, అవ‌స‌ర‌మైతే త‌ప్పా బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని కోరింది. హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్రతలు నిలకడగా 40°C నుండి 42°C మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41°C నుండి 43°C మధ్య ఉండవచ్చు అని తెలిపింది.

తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన వడగాలుల హెచ్చరిక జారీ చేయబడింది. రాబోయే వారం రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. వాతావరణ తాజా సమాచారం ప్రకారం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, గద్వాల్ వంటి జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42°C నుండి 45°C మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్రతలు నిలకడగా 40°C నుండి 42°C మధ్య కొనసాగే అవకాశం ఉంద‌ని తెలిపింది. కాగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41°C నుండి 43°C మధ్య ఉండవచ్చు అని అంచ‌నా వేసింది.