జ‌గ‌న్ రెడ్డికి పండితుల ఆశీర్వాదం

VijayaBhaskar · April 22, 2026
Spread the love

పులివెందుల లోని ఆయ‌న నివాసంలో

క‌డ‌ప జిల్లా : మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా జిల్లాలోని పులివెందుల త‌న‌ నివాసంలో,కోదండ రామాలయానికి చెందిన వేద పండితులు విచ్చేసి ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీతారాముల కల్యాణానికి సంబంధించిన ముత్యాల తలంబ్రాలు, పవిత్ర ప్రసాదాన్ని పండితులు వైయస్‌ జగన్‌ కు అందజేశారు. వేద మంత్రాల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో పండితులు ఆయనకు ఆయురారోగ్యాలు, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు.

అలాగే, ఆలయాల పవిత్రత, ఆగమ శాస్త్రాల పరిరక్షణ, సంప్రదాయాల ప్రాముఖ్యతపై వైయస్‌ జగన్‌ వేద పండితులతో చర్చించారు. దేవాలయాలలో నిత్య పూజలు, ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించడం ఎంతో అవసరమని, తద్వారా ఆధ్యాత్మిక విలువలు తరతరాలకు సంక్రమిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆలయాల అభివృద్ధి, వేద విద్య ప్రోత్సాహానికి గతంలో తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని వైయస్‌ జగన్‌ తెలిపారు. అనంతరం వైయస్‌ జగన్‌ వేద పండితులను ఆత్మీయంగా ఆహ్వానించి, వారి ఆశీర్వాదాలను వినమ్రంగా స్వీకరించారు.