ఒక‌రి కాళ్ల కింద బ‌త‌కాల‌ని పార్టీ పెట్ట‌లేదు

VijayaBhaskar · May 5, 2026
Spread the love

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన టీవీకే విజ‌య్

తమిళ‌నాడు : త‌మిళ‌నాట జ‌రిగిన ఎన్నిక‌ల్లో అఖండ మెజారిటీ సాధించిన టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విజ‌యం అనంత‌రం విజ‌య్ మీడియాతో మాట్లాడారు. ఇది ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పు అని, వారంద‌రికీ పేరు పేరునా తాను ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నాన‌ని తెలిపాడు. ఈ గెలుపు సులువుగా వ‌చ్చింది కాద‌న్నాడు. ప్ర‌జ‌లే చ‌రిత్ర నిర్మాత‌లు, వారే ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌తీక‌లు అని పేర్కొన్నాడు. నేనేమి పొత్తులు పెట్టుకుని ఒకరి కాళ్ళ కింద బతకాలని పార్టీ పెట్ట లేద‌ని ప్ర‌క‌టించాడు.

ఇంకొకరిని CM చేయడానికి నేను పార్టీ పెట్టలేదని స్ప‌ష్టం చేశాడు టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్. నేను పార్టీ పెట్టింది నిజాయితీగా నా కార్యకర్తలను వేరే పార్టీ జెండా మోయనివ్వకుండా ఉండాలని అన్నాడు. నేను పార్టీ పెట్టింది నా పార్టీ కార్యకర్తలను పోటీ చేసి , చేయించి గెలిపించి అధికారంలోకి రావాలని మాత్ర‌మేన‌ని ప్ర‌క‌టించాడు విజ‌య్. ఎవరితో పొత్తులేదు. ఎవరికి జై కొట్టేది లేద‌ని మ‌రోసారి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు.
King మేమే, king maker’s మేమే అంటూ విజయ్ వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.