కోటి 28 ల‌క్ష‌ల ఓట్ల‌ను కొల్ల‌గొట్టిన టీవీకే

VijayaBhaskar · May 5, 2026
Spread the love

ప్ర‌ధాన పార్టీల‌కు కోలుకోలేని షాక్

త‌మిళ‌నాడు : త‌మిళ‌నాడు రాష్ట్ర ఎన్నిక‌ల‌లో టీవీకే పార్టీ విజ‌య్ భారీ విజ‌యోన్ని న‌మోదు చేశారు. ఇక ఓట్ల ప‌రంగా చూస్తే అత్య‌ధిక ఓట్ల‌ను పొందింది ఆ పార్టీ. ఇది కూడా ఓ రికార్డ్ గా భావించ‌క త‌ప్ప‌దు. తమిళనాడులో సూపర్‌ హిట్టయిన విజయ్‌ టీవీకే పార్టీ ఏకంగా కోటి 28 లక్షల ఓట్లతో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానానికి పరిమితమైంది అధికార డీఎంకే కూటమి. డీఎంకే కూటమికి పోలైన ఓట్లు కోటి 17 లక్షలు. ఒంటరిగా 83 లక్షల ఓట్లు సాధించింది డీఎంకే. మూడో స్థానంతో సరిపెట్టుకున్న అన్నాడీఎంకే కూటమి. అన్నాడీఎంకే ఓట్లు కోటి 8 లక్షలు. అన్నాడీఎంకేకు ఒంటిరిగా 77 లక్షల ఓట్లు వ‌చ్చాయి.

ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై టీవీకే విజ‌య్ మీడియాతో మాట్లాడారు. ఇది ప్ర‌జ‌లు ఇచ్చిన చారిత్రాత్మ‌క‌మైన తీర్పు. వారు ఇచ్చిన తీర్పును శిర‌సావ‌హిస్తామ‌న్నారు. త‌మ పార్టీకి ఓట్లు వేసిన ప్ర‌తి ఒక్క‌రితో పాటు ఓటు వేయ‌ని వారికి కూడా ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇప్ప‌టికే తాము ప్ర‌క‌టించిన మేనిఫెస్టోను అమ‌లు చేసి తీరుతామ‌న్నారు. అవినీతి, అక్ర‌మాల‌కు తావు లేకుండా పాల‌న సాగిస్తామ‌ని, ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు టీవీకే విజ‌య్.