బండి కొడుకు కోసం వెతికినా దొర‌క‌డం లేదు

VijayaBhaskar · May 16, 2026
Spread the love

చేతులు ఎత్తేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి
హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ సుపుత్రుడు బండి సాయి ద‌శ‌ర‌థ్ పోక్సో కేసు. ఇప్ప‌టికే బాధితురాలి త‌ల్లి తీవ్ర ఆవేద‌న‌తో ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు. త‌మ గురించి అత్యంత నీచంగా ట్రోల్ చేస్తున్నారంటూ వాపోయింది. దీనిపై బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రించాల్సిన స‌ర్కార్ అనుస‌రిస్తున్న తీరు, సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణ‌యాలు, చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌కలం రేపాయి. ఆయ‌న పూర్తిగా కేంద్రానికి, బండి సంజ‌య్ కి, ఆయ‌న కొడుకుకు వంత పాడుతున్న‌ట్లుగా ఉంది.

తాజాగా హైద‌రాబాద్ లో నిర్వ‌హించిన చిట్ చాట్ లో అడిగిన ప్ర‌శ్న‌ల‌కు డొంక‌తిరుగుడు స‌మాధానం ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు సీఎం. బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోదండం ఎక్కించాలి అంటే కుదరద‌న్నారు. ఈ POCSO కేసులో కఠినంగా వెళ్లలేను వ్యవహరించలేనని తేల్చేశారు. కేసు నమోదు కాగానే వెంటనే ఇంటికి నోటీసులు అంటించామ‌ని, ఢిల్లీకి పోలీస్ టీమ్స్ పంపించాం, కానీ అతను దొరకట్లేదన్నారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ పై తెలంగాణ ప్ర‌జ‌లు విస్తు పోయారు. దేశ హోం శాఖ సహాయ మంత్రి కొడుకు పారిపోవడం కరెక్ట్ కాద‌న్నారు. బండి సంజయ్ వెంటనే ఆయన కొడుకును తీసుకొచ్చి అప్పగించాలన్నారు.