Friday, 16 October 2026

తెలంగాణ‌లో ప్ర‌త్యామ్నాయం బీజేపీనే

newsseals-BJPTelangana

స్ప‌ష్టం చేసిన రామ‌చంద‌ర్ రావు

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయం కేవ‌లం ఒక్క బీజేపీనేన‌ని స్ప‌ష్టం చేశారు ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు. మంగ‌ళ‌వారం బర్కత్‌పురాలోని సిటీ బీజేపీ కార్యాలయంలో రేఖా శర్మ తో కలిసి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వం, 12 ఏళ్ల సుపరిపాలనలో.. నిర్ణయాత్మక నాయకత్వం, అభివృద్ధి ఆధారిత పాలనతో దేశం సాధించిన అద్భుత ప్రగతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశరు.

తెలంగాణలో ఏకైక విశ్వసనీయ ప్రత్యామ్నాయం బీజేపీయేన‌ని ప్ర‌జ‌లు న‌మ్ముతున్నార‌ని చెప్పారు. వారిని మ‌న వైపు ఎలా తిప్పుకోవాల‌నే దానిపై ఫోక‌స్ పెట్టాల‌న్నారు. ప్రజలు మనవైపు ఎంతో ఆశతో చూస్తున్నార‌ని, ఆ విష‌యం నేత‌లు, కార్య‌క‌ర్త‌లు గుర్తించాల‌ని కోరారు. బీఆర్ఎస్ పూర్తిగా ఉనికి కోల్పోయిందంటూ ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు మాతో సంప్రదింపులు జరుపుతున్నారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు రామ‌చంద‌ర్ రావు. అలాగే ప్రధాని పిలుపు మేరకు “మేరా భారత్, మేరా యోగ్‌దాన్” జాతీయ కార్యక్రమంలో కార్యకర్తలంతా పూర్తి అంకితభావంతో పాల్గొనాలని పిలుపునిచ్చారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *