డిజిట‌ల్ హెల్త్ డేటా పూర్తి చేయాలి : సీఎం

మే 31వ తేదీ లోపు డెడ్ లైన్ విధించిన స‌ర్కార్

హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం అమల్లోకి తీసుకు వస్తున్న ఎంప్లాయిస్​ హెల్త్ స్కీమ్​ అమలుకు గాను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఎంప్లాయి హెల్త్ కేర్​ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు కానుంది. ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు, పెన్షనర్ల నుంచి ఇద్దరు ప్రతినిధులు ఈ ట్రస్ట్ సభ్యులుగా ఉంటారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరిని ఈ ట్రస్ట్ కు సీఈవోగా నియమిస్తారు. ఈ కమిటీను రేపు (సోమవారం) ప్రకటించే అవకాశముంది. ఈ పథకం అమలుకు అవసరమైన వివరాల సేకరణ ఇప్పటికే మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించేందుకు అర్ధిక (ఫైనాన్స్) శాఖ ఇప్పటికే అన్ని శాఖలకు సర్క్యులర్​ జారీ చేసింది. మే 31లోపు డేటా అప్‌లోడ్‌ చేయాలని స్పష్టం చేసింది . ఈ వివరాల ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు, క్యాష్‌లెస్ చికిత్స సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

  • Related Posts

    నిజామాబాద్ అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉన్నా

    హైద‌రాబాద్ : టీపీసీసీ చీఫ్ , ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉమ్మడి నిజామాబాద్ అభివృద్ధికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ మరో కీలక ముందడుగు వేశారు. జిల్లా…

    ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో మంత్రి ఎస్. స‌విత బిజీ

    అమరావతి : రాష్ట్రానికి చెందిన టెక్స్ టైల్స్ ఉత్పత్తులు అమ్మకాలే లక్ష్యంగా రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి గురువారం రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *