చెన్నై సూప‌ర్ కింగ్స్ వైపు పాండ్యా చూపు

ఇత‌ర జ‌ట్ల లోకి వెళ్లేందుకు నిరాక‌ర‌ణ

ముంబై : భార‌త క్రికెట్ జ‌ట్టుకు చెందిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. త‌ను కీల‌క‌మైన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ల‌లో ప్రాతినిధ్యం వ‌హించాడు. అయితే ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) 19వ సీజ‌న్ లో త‌న‌కు అచ్చీ రాలేదు. చాలా పేల‌వ‌మైన ఆట‌తీరుతో తీవ్రంగా నిరాశ ప‌రిచాడు. అటు ఆట‌గాడిగా, ఆల్ రౌండ్ షోలో విఫ‌లం కాగా మ‌రో వైపు ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టును ముందుండి న‌డిపించడంలో ఘోరంగా వైఫ‌ల్యం చెందాడు. దీంతో త‌న‌ను త‌ప్పించేందుకు ముంబై ఇండియ‌న్స్ మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తున్న‌ట్లు క్రికెట్ వ‌ర్గాల‌లో స‌మాచారం.

అయితే స‌ద‌రు జ‌ట్టు యాజ‌మాన్యం స్పందించ‌క ముందే, చ‌ర్య‌లు తీసుకోక ముందే తానే త‌ప్పుకునేందుకు రెడీ అయ్యాడు హార్దిక్ పాండ్యా. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, హార్దిక్ పాండ్యా ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంతో రెండుసార్లు సమావేశమయ్యారు. ఈ చర్చలు సానుకూలంగా సాగినట్లు, అలాగే CSKలో చేరడానికి హార్దిక్ స్వయంగా ఎంతో ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాకు బదులుగా శివం దూబే , అన్షుల్ కాంబోజ్‌లను ఇవ్వాలని ముంబై ఇండియన్స్ కోరే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం సీఎస్కే జ‌ట్టుకు కెప్టెన్ గా ఉన్న రుతురాజ్ ను త‌ప్పించి కొత్త‌గా జ‌ట్టులోకి వ‌చ్చిన సంజు శాంస‌న్ కు కెప్టెన్సీ ఛాన్స్ ఇవ్వ‌నున్న‌ట్లు టాక్

  • Related Posts

    వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపిక క‌రెక్టు కాదు

    హైద‌రాబాద్ : ప్ర‌ముఖ క్రికెట్ అనలిస్ట్, కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంగ్లండ్ టూర్ లో భాగంగా శ్రేయ‌స్ అయ్య‌ర్ నాయ‌క‌త్వంలో టీమిండియా టి20 సీరీస్ ను కోల్పోయింది. ఆఖ‌రి మ్యాచ్ లోనూ చేతులెత్తేశారు. ప్ర‌ధాన ఆట‌గాళ్లు ఆశించిన…

    వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్ లో ఎంఎస్ ధోనీ ఆడ‌టం క‌ష్ట‌మే

    చెన్నై : భార‌త దేశ క్రికెట్ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఏకైక క్రికెట‌ర్ జార్ఖండ్ డైన‌మెట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ. త‌న సార‌థ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ప‌లుమార్లు ఐపీఎల్ టైటిళ్ల‌ను స్వంతం చేసుకుంది. ప‌లువురిని మార్చింది సీఎస్కే యాజ‌మాన్యం.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *