ఉద్యమ కారుల గుర్తింపుపై అఖిలపక్ష సమావేశం

4న జ‌ర‌గ‌నుంద‌ని స్ప‌ష్టం చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, వారిని సముచిత రీతిలో గౌరవించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈనెల 4వ తేదీన అన్ని పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. డా.బీ.ఆర్.అంబెడ్కర్ రాష్ట్ర సచివాలయంలో 6వ అంతస్తులోని రూమ్ నెంబర్ 33 లో 4 వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి హాజరై తమ విలువైన సలహాలు, అభిప్రాయలు తెలిపేందుకు ఒక్కో పార్టీ నుండి ఇద్దరు ప్రతినిధులను నామినేట్ చేయాలని ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీలను కోరింది.

ఈ పార్టీల ప్రతినిధులు 4వ తేదీ సమావేశానికి హాజరయ్యేందుకు సచివాలయంలోకి ఏవిధమైన ఇబ్బందులు లేకుండా ప్రవేశించేందుకు వీలుగా ముందస్తుగా తెలంగాణ రాష్ట్ర సచివాలయ చీఫ్ సెక్యూరిటీ అధికారి దేవీదాస్ (87126 66004 )ని సంప్రదించాలని ఒక అధికారిక ప్రకటనలో కోరింది. ఇదిలా ఉండ‌గా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం. ప‌లు పార్టీలు ప్ర‌భుత్వం ఉదాసీన వైఖ‌రి ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

  • Related Posts

    విప‌క్షాల నినాదాల మ‌ధ్య రాజ్య‌స‌భ వాయిదా

    న్యూఢిల్లీ : విపక్షాల నినాదాల మధ్య రాజ్యసభ వాయిదా ప‌డింది. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను మాట్లాడనివ్వాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. దీనిని అధికార పక్షం వ్యతిరేకించింది. ‘జీరో అవర్’ (Zero Hour) కార్యకలాపాల సమయంలో…

    నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు

    హైద‌రాబాద్ : తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఖండించారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. సాక్షిలో వచ్చిన కథనాలను ఖండిస్తున్నాన‌ని పేర్కొన్నారు. నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడ లేద‌న్నారు. త‌నపై ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజా ప్రతినిధులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *