తెలంగాణ మీ అయ్య జాగీరా..?

పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

హైద‌రాబాద్ : జ‌న‌సేన పార్టీ చీఫ్‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి తెలంగాణ‌పై నోరు పారేసుకున్నారు. రెచ్చ‌గొట్టేలా మాట్లాడారు. తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ ప్ర‌శ్నించారు. దాడులు చేస్తారా అయితే ఇక్క‌డే ఉంటా ద‌మ్ముంటే రావాల‌ని స‌వాల్ విసిరారు .తెలంగాణపై కమిట్మెంట్ ఉంది కాబట్టే కొండగట్టు అంజన్నకు ముప్పై కోట్లు ఇచ్చానని అన్నారు. అడ్డుకుంటారా..? నేనే తిరుగుతా ఇక్కడ అంతటా..! ఇప్పుడు డిసైడ్ అయ్యాన‌ని ప్ర‌క‌టించారు. తెలంగాణ దేశంలో అంతర్భాగం అని మీరెవరు అడ్డుకోవడానికి అని నిల‌దీశారు.

తెలంగాణా లో జనసేన ఉంటుందన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎలా తిరుగుతావ్ తెలంగాణలో అంటున్నారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా గతంలో ఇలాగే అన్నారు అప్పట్లో అని గుర్తు చేశారు. ఇక్కడ భయపడేవాడు ఎవ్వరూ లేరన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఇది నా దేశం నేను ఎక్కడైనా అడుగు పెట్టేందుకు హ‌క్కు ఉంద‌న్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ కేరళం లో , వయనాడు లో పోటీ చేయొచ్చు. ఇందిరాగాంధీ మెదక్ లో పోటీ చేయొచ్చు. మేము వస్తె అడ్డుకుంటారా అని అన్నారు. కాంగ్రెస్ కు ఒక పద్ధతి ఉందా.. ఏం మాట్లాడుతున్నారు మీరు. నేను చెరువును కబ్జా చేశానా..అలా కబ్జా చేసి ఉంటే విడిచిపెట్టే వాళ్లా అని నిల‌దీశారు.

  • Related Posts

    ప్రాజెక్టుల‌కు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు మంజూరు చేయాలి

    ఢిల్లీ: పాలమూరు-రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మ సాగర్, దిండి ప్రాజెక్టులకు తక్షణమే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను కోరారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రాష్ట్ర నీటిపారుదల…

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *