శ్రీవారిని దర్శించుకున్న సీఎం డీకే శివకుమార్
తనతో పాటు కుటుంబం కూడా స్వామి దర్శనం
తిరుమల : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవలే కొలువు తీరారు డీకే శివకుమార్. ఆయన కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందారు. తన సారథ్యంలోనే పార్టీ రాష్ట్రంలో పవర్ లోకి వచ్చింది. ఇంకా రెండేళ్ల పాటు ఆయన సీఎంగా ఉంటారు రాష్ట్రానికి. తన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి కావాలన్నది తన కల ఆయన పదే పదే చెబుతూ వచ్చారు. డీకే శివకుమార్ తో పాటు తన భార్య, కూతురు, కుటుంబీకులకు తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి అంటే వల్లమాలిన భక్తి, అభిమానం కూడా. ఇటీవలే తాను ముఖ్యమంత్రి పీఠంపై ఆశీసులయ్యారు.
ఈ సందర్బంగా స్వామి వారిని శుక్రవారం దర్శించుకున్నారు తన సతీమణి, కుటుంబంతో కలిసి. ఇదిలా ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాలు మోపిన తనకు ప్రోటోకాల్ ప్రకారం దర్శన భాగ్యం కల్పించారు. ఆచార్యులు, పురోహితులు, పూజారులు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. నా అర్ధాంగితో కలిసి తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గర్భాలయాన్ని సందర్శించి, స్వామివారి దివ్య దర్శనం చేసుకున్నాను. రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశాను . జగదుద్ధారకుడైన శ్రీనివాసుని అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని, మన ప్రాంతం సుభిక్షంగా వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు సీఎం డీకే శివకుమార్.